మెత్తగా కరిగే రాగి ఇడ్లీలు – ఆరోగ్యానికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్
సాధారణంగా మనం బియ్యం పిండితో ఇడ్లీలు తయారు చేస్తుంటాం. అయితే బియ్యం స్థానంలో రాగులతో చేసిన ఇడ్లీలు ఆరోగ్యానికి ఎన్నో రెట్లు మేలు చేస్తాయి. రాగులు పోషకాల గనిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇతర అన్ని ధాన్యాలతో పోలిస్తే రాగుల్లో కాల్షియం శాతం అత్యధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడంలో, వృద్ధాప్యంలో వచ్చే ఎముకల సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అంతేకాదు, రాగుల్లో ఇనుము (ఐరన్), ఫైబర్, ప్రోటీన్, మాగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి కూడా రాగి ఇడ్లీలు మంచి ఎంపికగా నిలుస్తాయి, ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడతాయి.
Ragi Laddu Recipe:ఎముకల నొప్పులు, అలసటకు బెస్ట్ హోం మేడ్ రాగి లడ్డు
రోజువారీ ఆహారంలో రాగి ఇడ్లీలు చేర్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, సంప్రదాయ రుచితో పోషక విలువలు రెండూ ఒకేసారి పొందవచ్చు. అయితే రాగి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- రాగి రవ్వ
- ఇడ్లీ రవ్వ
- మినపప్పు
- మెంతులు
తయారీ విధానం
ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి, మునిగేంతవరకు నీరు పోసి అందులోనే 1 టీస్పూన్ మెంతులు వేసి కనీసం 6 గంటల పాటు నానబెట్టాలి.
Diabetes Control: షుగర్ ఉన్నవారికి ఈ ఒక్క ఆకు అమృతం.. రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
6 గంటల తర్వాత నానిన మినపప్పును మళ్లీ శుభ్రంగా కడిగి నీరు వంపేసి, మిక్సీ గిన్నెలో వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తర్వాత నానబెట్టిన రాగి రవ్వ, ఇడ్లీ రవ్వ మిశ్రమంలోని నీటిని వంపేసి, ముందుగా గ్రైండ్ చేసిన మినపప్పు పిండిలో వేసి చేత్తో బాగా కలుపుకోవాలి. అనంతరం మూత పెట్టి రాత్రంతా లేదా కనీసం 8 గంటల పాటు పక్కన పెట్టాలి.
తర్వాత మూత తీసి చూస్తే పిండి బాగా పొంగి ఉంటుంది. ఇప్పుడు ఇందులో అవసరమైనంత ఉప్పు వేసి మెల్లగా కలుపుకోవాలి.
ఇడ్లీలు ఉడికించే విధానం
ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో సిద్ధం చేసిన పిండి మిశ్రమాన్ని సమానంగా పోసి, వాటిని ఇడ్లీ పాత్రలో అమర్చాలి. తర్వాత స్టవ్ మీద పెట్టి మోస్తరు మంటపై 10–12 నిమిషాలు ఆవిరితో ఉడికిస్తే సరిపోతుంది. ఆవిరి బాగా పట్టి ఇడ్లీలు మృదువుగా, పూసల్లా ఉబ్బి వస్తాయి.
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రెండు నిమిషాలు అలాగే ఉంచి, ప్లేట్లను జాగ్రత్తగా తీసి స్పూన్ సహాయంతో ఇడ్లీలు బయటకు తీసుకోండి.
అంతే… ఆరోగ్యానికి మేలు చేసే, రుచిగా ఉండే రాగి ఇడ్లీలు రెడీ. కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేస్తే ఈ ఇడ్లీలు మరింత టేస్టీగా ఉంటాయి.
