రోజువారీ వంటకాలలో టమోటాలు ఒక తప్పనిసరి పదార్థంగా మారిపోయాయి. కూరలు, సూప్‌లు, చట్నీలు, సలాడ్‌లు — ఏ వంటకం తీసుకున్నా టమోటా రుచి, రంగు, పులుపుతో భోజనానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. దాదాపు ప్రతి ఇంట్లోనూ టమోటాలు రోజూ వాడటం సహజమే. కొందరు చిన్నపిల్లలు, పెద్దలు టమోటాలను పచ్చిగా కూడా తినడానికి ఇష్టపడతారు.
టమోటాలు విటమిన్ C, విటమిన్ A, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, చర్మానికి కాంతినిస్తూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ టమోటాల్లో అధికంగా ఉండటం వలన క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గించడంలో కూడా ఇవి దోహదపడతాయి.ఈ గింజల్లోని విటమిన్లు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అందుకే చాలా మంది టమోటాలు ,దా టమోటా సూప్ మాత్రమే తాగుతారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకుండా ఉండాలి.
అసిడిటీ, కడుపులో గ్యాస్ లేదా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (IBS) వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు టమోటా గింజల వల్ల అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. టమోటాల్లో ఉండే ఆమ్ల పదార్థాలు (acids) కడుపులో ఆమ్లతను మరింతగా పెంచి, అసిడిటీ లక్షణాలను ఎక్కువ చేస్తాయి. అలాగే గింజలు జీర్ణం కావడం కష్టం కావడంతో, గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉత్పత్తి కావచ్చు.ముఖ్యంగా IBS ఉన్నవారు పచ్చి టమోటా లేదా టమోటా సాస్, చట్నీ వంటి ఆమ్లత ఎక్కువగా ఉండే పదార్థాలను దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి పేగులలో రాపిడిని పెంచి అసౌకర్యం కలిగించవచ్చు.
టమోటాలను తరచుగా తినడం వల్ల ఆక్సలేట్ స్థాయి పెరిగి, మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా నీరు తక్కువగా తాగే వారు, ఉప్పు ఎక్కువగా వాడే వారు లేదా ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకునే వారు ఈ ప్రమాదానికి ఎక్కువగా గురవుతారు.
వైద్యులు కూడా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారికి టమోటాలను గింజలు తీసి తినమని లేదా పూర్తిగా మానేయమని సూచిస్తారు. బదులుగా దోసకాయ, గాజరులు, పుచ్చకాయ, ద్రాక్ష వంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
