టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. నవీ ముంబయి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో మంధాన అరుదైన రికార్డు సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆమె 55 బంతుల్లో 45 పరుగులు చేసింది.
తన అర్థ సెంచరీని మిస్ చేసుకున్న సరే ఒక రికార్డునైతే సొంతం చేసుకుంది. ఈ వరల్డ్ కప్ లో శృతి మందన చాలా నిలకడగా ఆడుతూ ఒక మంచి స్కోర్ ను నమోదు చేస్తూ వచ్చింది. 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు బాదింది. మొత్తం 9 ఇన్నింగ్స్‌ల్లో ఆమె 54.25 సగటుతో 434 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ తరఫున సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. ఇదివరకు ఈ రికార్డు మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ పేరిట ఉండేది. ఆమె 2017 వరల్డ్‌కప్‌లో 409 రన్స్ చేసింది. కాగా, ఈ రికార్డును మంధాన తాజా ఎడిషన్‌లో బద్దలు కొట్టింది.
2025 కేలండర్ సంవత్సరంలో మహిళల వన్డేల్లో 1000 రన్‌లకు మించి స్కోర్ చేసిన తొలి బ్యాటర్‌గా మంధాన నిలిచింది. ఇది మహిళల క్రికెట్ చరిత్రలో ఎవరూ చేయని ఘనత. ఈ రికార్డుతో ఆమె ఆస్ట్రేలియా లెజెండ్ బెలిండా క్లార్క్ 1997లో సాధించిన 970 రన్‌ల రికార్డును అధిగమించింది. అదే మ్యాచ్‌లో, మంధాన తన వన్డే కెరీర్‌లో 5000+ రన్‌లను కూడా పూర్తిచేసి “యంగెస్ట్ & ఫాస్టెస్ట్ ఇండియన్ బ్యాటర్”గా కొత్త గుర్తింపును పొందింది.
ఈ ఘనతను ఆమె ICC Women’s Cricket World Cup 2025 లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సాధించింది. మొదట కొంత ఒత్తిడిలోకి వెళ్లినప్పటికీ, ఆ తర్వాత అద్భుతమైన బ్యాటింగ్‌తో సత్తా చాటింది. ఆ ఇన్నింగ్స్‌లో ఆమె శాంతంగా ఆడుతూ, కీలక సమయాల్లో అద్భుతమైన షాట్లు ఆడి జట్టుకు బలమైన స్థానం ఇచ్చింది.ఇలా రెండు రికార్డులు అయితే శృతి మందన తనకైవసం చేసుకుంది

