ఖరీదైన క్రీములు అవసరం లేదు: శీతాకాలంలో డ్రై స్కిన్‌కు సులభ పరిష్కారం

శీతాకాలంలో పొడి చర్మం సమస్య చాలా మందిని వేధిస్తుంది. చలికాలంలో గాలిలో తేమ తగ్గిపోవడం, వేడి నీటితో స్నానాలు చేయడం, చర్మాన్ని సరైన విధంగా సంరక్షించకపోవడం వల్ల చేతులు, కాళ్లు మాత్రమే కాకుండా ముఖం కూడా పొడిబారి నిస్తేజంగా మారుతుంది. కొందరిలో చర్మం పగిలిపోవడం, దురద, మంట వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి.

Natural Winter Skin Care Tips

అయితే ఈ సమస్యకు ఖరీదైన క్రీములు తప్పనిసరి కాదు. ఇంట్లోనే సులభంగా దొరికే సహజ పదార్థాలతో పొడి చర్మాన్ని చాలా వరకు నియంత్రించవచ్చు. సహజ నివారణలు చర్మానికి కావలసిన తేమను అందించి, నష్టపోయిన కాంతిని తిరిగి తీసుకురావడంలో సహాయపడతాయి.

శీతాకాలంలో రాత్రిపూట చర్మం మరింత పొడిబారి ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో చర్మం తేమను త్వరగా కోల్పోతుంది కాబట్టి, పడుకునే ముందే సరైన సంరక్షణ చాలా అవసరం. అందుకే నిద్రకు ముందు కొబ్బరి నూనెతో తేలికపాటి మసాజ్ చేసుకోవడం ఎంతో ఉపయోగకరమని సూచిస్తున్నారు

Winter Skin Care Without Expensive Creams

కొబ్బరి నూనె చర్మంలోకి వేగంగా గ్రహించబడుతూ లోపలి పొరలకు పోషణ అందిస్తుంది. ఇది చర్మంలో తేమను నిలుపుకుని, రాత్రంతా పొడిబారకుండా కాపాడుతుంది. నిద్రకు వెళ్లే ముందు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని ముఖం, చేతులు, కాళ్లపై మృదువుగా మసాజ్ చేసి అప్లై చేయాలి.

శీతాకాలంలో చేతులు, కాళ్లలో పొడిబారటం చాలా సాధారణ సమస్య. చల్లని గాలి తాకడంతో పాటు తేమ తగ్గిపోవడం వల్ల చర్మం రఫ్‌గా మారి, ముఖ్యంగా వేళ్లు మరియు మడమల వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఈ పరిస్థితుల్లో గ్లిజరిన్ – రోజ్ వాటర్ మిశ్రమం ఒక మంచి సహజ పరిష్కారంగా ఉపయోగపడుతుంది.

గ్లిజరిన్ చర్మంలోని తేమను నిలబెట్టేలా పనిచేస్తే, రోజ్ వాటర్ చర్మాన్ని చల్లబరచి నర్మదనం మరియు తాజాతనం ఇస్తుంది. ఈ రెండింటిని సమాన మోతాదులో కలిపి ప్రతి రాత్రి పడుకునే ముందు చేతులు, కాళ్లపై అప్లై చేయాలి. పగిలిన వేళ్లు, మడమలపై కొద్దిగా ఎక్కువగా రాసి మృదువుగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మానికి కావలసిన తేమ చేరి మృదువుగా, సాఫ్ట్‌గా మారుతుంది. పగుళ్లు తగ్గడమే కాకుండా నొప్పి, అసౌకర్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

Post a Comment

Previous Post Next Post

Contact Form