ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం విధానంపై దృష్టి సారించి, యువతకు ఇంటి నుంచే పని చేసే అవకాశాలు అందించేందుకు గత కొంతకాలంగా విస్తృత స్థాయిలో కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ‘కౌశలం’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఏపీలోని నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే అవసరమైన నైపుణ్యాలు, ఆసక్తులు, సాంకేతిక సదుపాయాలపై యువత నుంచి సమాచారం సేకరించేందుకు సర్వేను కూడా నిర్వహించింది.
![]() |
| NaraLokesh |
ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లుతూ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు, సేవారంగ భాగస్వామ్యంతో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలను అనుసంధానించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. అవసరమైన స్కిల్ ట్రైనింగ్, ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలు అందించి, ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న యువతను నేరుగా నియామక ప్రక్రియలో పాల్గొనేలా చేయనుంది.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల పరిధిలో కంప్యూటర్ ఆధారిత నైపుణ్య పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. కౌశలం కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు సర్వేలో నమోదు చేసుకున్న అభ్యర్థులందరినీ వారి విద్యార్హతలు, ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగా ఎంపిక చేశారు.
Kaushalam Programme: Computer-Based Skill Test
ఈ నెల 8వ తేదీ వరకు కౌశలం అర్హత పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ముందుగానే అభ్యర్థులకు మొబైల్ ఫోన్ ద్వారా మెసేజ్‌లు పంపిస్తూ సమాచారాన్ని అందించారు.పరీక్ష రాసే కేంద్రం ఎక్కడ ఉండాలి, ఏ తేదీ మరియు ఏ సమయానికి పరీక్ష రాయాలి, పరీక్ష విధానం ఎలా ఉంటుంది వంటి పూర్తి వివరాలను మెసేజ్‌ల ద్వారా సర్వేలో నమోదు చేసుకున్న ప్రతి అభ్యర్థికి తెలియజేశారు. తద్వారా అభ్యర్థులు ఎలాంటి అయోమయం లేకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేశారు.
Web cams are There
ఈ కౌశలం నైపుణ్య పరీక్షలకు అభ్యర్థులు ప్రతిరోజూ రెండు విడతలుగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఒక సెషన్‌గా, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు రెండో సెషన్‌గా పరీక్షలను నిర్వహిస్తున్నారు.పరీక్షలను పూర్తిగా పర్యవేక్షణతో నిర్వహించేందుకు వెబ్ కెమెరాలు, హెడ్‌సెట్లు వంటి అవసరమైన సాంకేతిక పరికరాలను సచివాలయాల్లో సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లతో అభ్యర్థుల పరీక్ష ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం కొనసాగనుంది.
