క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే (స్టేజ్–1) గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడటం చాలా వరకు సులభమే. కానీ సమస్య ఏమిటంటే… చాలా మంది ఆ తొలిసంకేతాలను గమనించరు. నిజానికి క్యాన్సర్ ఒక్కసారిగా వచ్చిపడదు. అది వచ్చే ముందు మన శరీరం చిన్న చిన్న హెచ్చరికలు (hints) ఇస్తూనే ఉంటుంది.
![]() |
| getty images |
చాలా మంది తమ శరీరం ఇచ్చే చిన్న చిన్న సిగ్నల్స్‌ని పట్టించుకోరు. స్టార్టింగ్ స్టేజ్‌లోనే సమస్యను గుర్తించకపోవడంతో, వ్యాధి మెల్లగా లోపలే పెరిగి ముదిరే వరకు సైలెంట్‌గా ఉంటుంది. ఎలాంటి పెద్ద నొప్పులు లేకపోయినా, లోపల ప్రమాదం పెరుగుతూనే ఉంటుంది.
స్టేజ్ 1 క్యాన్సర్ అంటే ఏమిటి?
క్యాన్సర్ కణితి (Tumor) ఇంకా చిన్నగా ఉండి, అది పుట్టిన అవయవానికే పరిమితమై ఉంటే దాన్ని స్టేజ్–1 అంటారు. ఈ దశలో అది లింఫ్ నోడ్స్‌కు గానీ, శరీరంలోని ఇతర భాగాలకు గానీ పాకి ఉండదు. స్టేజ్–1లో చికిత్స ప్రారంభిస్తే రికవరీ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
![]() |
| getty images |
అయితే ఈ దశలో లక్షణాలు చాలా మైల్డ్‌గా ఉండటం వల్ల చాలామంది వాటిని నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి శరీరం ఇస్తున్న హెచ్చరికలను సమయానికి గుర్తించడం చాలా ముఖ్యం.
1) శరీరంపై గడ్డలు (Lumps)
ఛాతీ, మెడ, చంకలు (Armpits) లేదా గజ్జల్లో కొత్తగా గడ్డలు తగిలినా లేదా వాపు కనిపించినా వెంటనే అలర్ట్ అవ్వాలి. నొప్పి లేకపోయినా డాక్టర్‌కు చూపించడం మంచిది.
2) చర్మంపై అకస్మాత్తు మార్పులు
పుట్టుమచ్చలు (moles) రంగు లేదా ఆకారం మారడం, ఎప్పటికీ మానని పుండ్లు, తరచూ రక్తం వచ్చే గాయాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి స్కిన్ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలై ఉండొచ్చు.
![]() |
| getty images |
3) కారణం లేకుండా బరువు తగ్గడం
డైటింగ్ లేదా ఎక్సర్‌సైజ్ చేయకపోయినా సడన్‌గా 5 నుంచి 10 కిలోల బరువు తగ్గితే అది హెచ్చరిక కావచ్చు.
4) తగ్గని అలసట (Persistent Fatigue)
ఎంత నిద్రపోయినా, రెస్ట్ తీసుకున్నా అలసట తగ్గకపోతే శరీరం లోపల సమస్య ఉన్న సంకేతం కావచ్చు.
Readalso:warm water ఉదయాన్నే పరగడుపునే గోరు వెచ్చని నీరు తాగుతున్నారా..? ఈ నిజాలు తప్పక తెలుసుకోండి!
5) తగ్గని నొప్పి
శరీరంలో ఒకేచోట నొప్పి వారాల తరబడి కొనసాగితే దాన్ని లైట్‌గా తీసుకోకూడదు. ప్రత్యేకంగా ఎముకల్లో లేదా పొట్టలో నిరంతర నొప్పి హెచ్చరిక కావచ్చు.
ReadAlso:Ragi Laddu Recipe:ఎముకల నొప్పులు, అలసటకు బెస్ట్ హోం మేడ్ రాగి లడ్డు
6) మల–మూత్రపు అలవాట్లలో మార్పులు
మలంలో లేదా మూత్రంలో రక్తం కనిపించడం, దీర్ఘకాలిక మలబద్ధకం లేదా డయేరియా కొన్ని క్యాన్సర్ల ప్రారంభ సంకేతాలై ఉండొచ్చు.
7) దీర్ఘకాలిక దగ్గు లేదా స్వర మార్పు
వారాల తరబడి తగ్గని దగ్గు, స్వరంలో మార్పు, రక్తంతో దగ్గు రావడం లంగ్ లేదా థ్రోట్ క్యాన్సర్ ప్రారంభ దశలో కనిపించవచ్చు.
ముఖ్య గమనిక: ఈ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా క్యాన్సర్ ఉందని కాదు. కానీ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం చాలా వరకు పెరుగుతుంది.


