warm water ఉదయాన్నే పరగడుపునే గోరు వెచ్చని నీరు తాగుతున్నారా..? ఈ నిజాలు తప్పక తెలుసుకోండి!

నీరు మన శరీరానికి ఎందుకు అత్యంత అవసరం?

News Scrolling Bar

నీరు మన శరీరానికి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన శరీరంలో సుమారు 60 నుంచి 70 శాతం వరకు నీటితోనే తయారై ఉంటుంది. శరీరంలో జరిగే డిటాక్సిఫికేషన్ ప్రక్రియ, రక్తప్రసరణ, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం, కణాల పునర్నిర్మాణం, అలాగే శరీర జీవక్రియలు (Metabolism) సరిగా కొనసాగాలంటే నీరు తప్పనిసరి.

అంతేకాదు రోజూ సరిపడా నీరు తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లి, కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేస్తాయి. చర్మం తేమగా, కాంతివంతంగా మారడమే కాకుండా అలసట తగ్గి, శక్తి స్థాయి పెరుగుతుంది. అలాగే తలనొప్పి, మలబద్ధకం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు దూరమవుతాయి.

ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగితే?

రోజూ మనం నీటిని తాగుతున్నప్పటికీ, ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం ఈ అలవాటు చాలామందిలో సాధారణంగా మారిందని చెప్పవచ్చు. ఉదయం పూట నీటిని తాగడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది అని చాలా మంది నమ్ముతుంటారు.

గోరు వెచ్చని నీరు తాగే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

మనం తాగే నీరు 60 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి లేకుండా చూసుకోవాలి. అధిక వేడి ఉన్న నీటిని తాగడం వల్ల నాలుకలోని సున్నితమైన పొర దెబ్బతింటుంది. దంతాలపై ఉండే ఎనామిల్ కాలక్రమేణా బలహీనపడుతుంది.

వేడి నీరు కొందరిలో యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎక్కువ వేడి నీటిని తాగడం వల్ల గొంతు చికాకు, బొంగురు గొంతు, గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

కాబట్టి ఉదయం పూట నీటిని తాగేటప్పుడు అది గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Post a Comment

Previous Post Next Post

Contact Form