తెలుగులో తొలి పాప్ సింగర్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్మిత, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సంగీత ప్రయాణం గురించి సాధారణంగా మాట్లాడారు. చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంపొందించుకోవడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం కీలక పాత్ర పోషించిందని ఆమె తెలిపారు. వారి మద్దతు వల్లనే తన కెరీర్‌ను నమ్మకంగా ముందుకు తీసుకెళ్లగలిగానని చెప్పారు.
అంతేకాదు వ్యక్తిగతంగా తన జీవితంలో స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా అమ్మమ్మ తేనె లక్ష్మీకాంతమ్మ (ఖమ్మం)ని స్మిత గుర్తు చేసుకున్నారు. ఆమె నుంచి నేర్చుకున్న విలువలు తన జీవితం, సంగీత ప్రయాణంలో సహాయపడ్డాయని తెలిపారు.
సింగర్ స్మిత తన కెరీర్ విశేషాలు, తనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు, అలాగే మల్లీశ్వరి చిత్రంలో తన అనుభవం గురించి కూడా పంచుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రయాణం సాఫీగా, సానుకూలంగా సాగిందని ఆమె తెలిపారు. ఈ సమయంలో ఎన్నో మంచి అనుభవాలు కలిగాయని, పని పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి పరిచయాలు ఏర్పడ్డాయని చెప్పారు.
ReadAlso:డిగ్రీ ఉన్న విద్యార్థులకు శుభవార్త – రూ.20 లక్షల స్కాలర్‌షిప్ అవకాశం
పరిశ్రమలో పని చేస్తూ ఎంతో మంది తనకు సహకరించారని, వారిలో చాలామంది మంచి స్నేహితులుగా మారారని పేర్కొన్నారు. ఈ అనుభవాలన్నీ తన సినీ ప్రయాణాన్ని మరింత మధురంగా చేశాయని స్మిత వెల్లడించారు.
ప్రస్తుతం ప్లేబ్యాక్ సింగింగ్‌ను కొనసాగిస్తున్నప్పటికీ, ఆసక్తికరమైన పాటలు వచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటానని, గతంలో వలె చురుకుగా లేనని చెప్పారు. దీనికి కారణంగా తాను ఒకేసారి పలు రంగాల్లో ఆసక్తి చూపడం, వ్యాపార రంగంలోనూ తన దృష్టి ఉండటమేనని వివరించారు.
మల్లీశ్వరి చిత్రంలో నెగటివ్ పాత్రను ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు స్మిత ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఆ పాత్రపై ముందుగా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే తాను చేయకపోయేదాన్నని, కానీ ఒకసారి అంగీకరించిన తర్వాత వెనక్కి తగ్గడం సాధ్యపడలేదని ఆమె స్పష్టంచేశారు.
