ఏ క్షణమైనా వాళ్లతో కమిట్ అవుతానేమో… నటి సంచలన వ్యాఖ్యలు

News Scrolling Bar

సినిమా పరిశ్రమ… సినీ నటులు అంటే చాలా మందికి అది ఒక కలల ప్రపంచం. వెలుగు జిలుగులు, స్టార్‌డమ్‌, భారీ ఫాలోయింగ్‌, పాపులారిటీ చూసి ఎందరో సామాన్య యువతీ యువకులు తమ జీవితాన్ని మార్చేసే అవకాశమిదే అని భావించి చెన్నై, హైదరాబాద్‌, ముంబై వైపు రైళ్లు ఎక్కుతారు. “ఒక ఛాన్స్ వస్తే చాలు” అనే ఆశతో ఇంటి నుంచి బయలుదేరుతారు.

Senior actress Esther Noronha speaks about casting couch during a media interview

కానీ ఆ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాతే అసలు నిజం బయటపడుతుంది. అవకాశాలు అంత తేలికగా రావు. టాలెంట్‌ కంటే పరిచయాలు, అదృష్టం కంటే సిఫారసులు ఎక్కువగా పని చేసే పరిస్థితులు అక్కడ చాలానే ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారికి ఇది మరింత కఠినమైన ప్రయాణం.

ఇక్కడ “కమిట్‌మెంట్”, “అడ్జస్ట్‌మెంట్”, “రాజీ” అనే మాటలు చాలా సాధారణంగా వినిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ అధికారం, హోదాను అడ్డుపెట్టుకుని యువతులపై ఒత్తిడి తెస్తూ, వారి కలలను, జీవితాలను నాశనం చేస్తూనే ఉన్నారనే ఆరోపణలు ఎన్నో సార్లు వినిపిస్తున్నాయి.

పడక సుఖం పేరుతో బ్లాక్‌మెయిల్‌, మానసిక వేధింపులు, అవకాశాల పేరుతో జరిగే దోపిడీ—ఇవన్నీ ఈ గ్లామర్‌ వెనుక దాగి ఉన్న చేదు నిజాలు.

బయట నుంచి చూస్తే ఆకాశంలా కనిపించే సినీ ప్రపంచం, లోపలికి వెళ్తే మాత్రం అనేక ముళ్లతో నిండిన మార్గంలా మారుతుంది. కలలు కన్నవారిలో కొందరే శిఖరాలకు చేరుతారు, మిగతావాళ్లు మౌనంగా తమ ఓటములను మోస్తూ వెనుదిరుగుతారు.

తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసి, పేరు-ప్రఖ్యాతులు సంపాదించి, ఈ స్థాయికి వచ్చినప్పటికీ ఇంకా తనను “కమిట్‌మెంట్” పేరుతో అడుగుతూనే ఉన్నారని ఆమె బహిరంగంగా వెల్లడించారు. ఇది వింటేనే గ్లామర్‌ ప్రపంచం వెనుక దాగి ఉన్న చేదు నిజం మరోసారి బయటపడినట్టే.

👉Readalso:Singham Movie: 'సింగం' సినిమాలో డానీ మామ ఇప్పుడెలా ఉన్నాడో డానీ మామ సింగం తర్వాత ఇలా మారిపోయాడా?!

అసలు ఆ సీనియర్ హీరోయిన్ ఎవరు? ఇప్పటికీ ఆమెను కమిట్‌మెంట్ అడుగుతున్నది ఎవరు? అది ఏ పరిశ్రమలో, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి?

ఆ నటి ఎవరో కాదు… ఎస్తర్ నోరోన్హా. భీమవరం బుల్లోడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత గరం, జయ జానకి నాయక వంటి చిత్రాల్లో నటించి తనదైన మార్క్ వేసే ప్రయత్నం చేసింది. అయితే హీరోయిన్‌గా పెద్ద స్థాయి స్టార్‌డమ్ మాత్రం ఆమెకు దక్కలేదు.

అయినా సరే, అవకాశాలు వచ్చిన ప్రతీసారి వదులుకోకుండా ముందుకు సాగింది. సహాయక పాత్రల్లో, ప్రత్యేక పాత్రల్లో, అలాగే ఐటెం సాంగ్స్‌లోనూ కనిపిస్తూ తన ఉనికిని నిలుపుకునే ప్రయత్నం చేసింది. ఒక దశలో హాట్ హాట్ సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది.

News Card Layout
Also read

తాజాగా ‘అమరావతికి ఆహ్వానం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంతో సినిమాకు సంబంధించిన ప్రచారం ఊపందుకోగా, చిత్ర యూనిట్ కూడా వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇస్తోంది.

ఈ క్రమంలో హీరో శివ కంఠంనేని, నటి ఎస్తర్ నోరోన్హా కలిసి ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఎస్తర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమె మాట్లాడిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.

ఎస్తర్ మాట్లాడుతూ… కెరీర్ ప్రారంభ దశలో కొందరు పరోక్షంగా “కమిట్‌మెంట్” అడుగుతారని, అప్పట్లో అది మనకు స్పష్టంగా అర్థం కాకపోవచ్చని చెప్పింది. కానీ ఒకసారి ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాక, అది సంవత్సరాల తరబడి వెంటాడుతూనే ఉంటుందని ఆమె వ్యాఖ్యానించింది.

ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే… “రెండ్రోజుల క్రితమే నాకు మళ్లీ అలాంటి కాల్ వచ్చింది” అంటూ ఆమె బహిరంగంగా వెల్లడించింది.

చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూలలో నేను కష్టపడి వచ్చాను.. టాలెంట్‌తోనే పైకి వచ్చాను, ఒక్కరు కూడా నన్ను కమిట్‌మెంట్ అడగలేదని చెబుతారు. తర్వాత వాళ్లు చేసుంటారు. నేను కూడా అలాంటి వాళ్లలో ఒకరిని అని చాలామంది అనుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post

Contact Form