రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత సమంత తీసుకున్న షాకింగ్ డిసిషన్

తెలుగుతో పాటు తమిళంలోనూ పలు విజయవంతమైన సినిమాలు చేసి, రెండు ఇండస్ట్రీల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది సమంత. వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న ఆమె, 2017 అక్టోబర్‌లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2021లో ఈ జంట విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది.

రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత సమంత తీసుకున్న షాకింగ్ డిసిషన్

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తన వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టి పూర్తిగా కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తనదైన మార్క్ చూపిస్తూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఆమె బాలీవుడ్‌లోనూ బలమైన స్థానం సంపాదించుకుంది.

ఇదిలా ఉండగా, గతేడాది డిసెంబర్‌లో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత వివాహం చేసుకుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని కథనాల ప్రకారం భూత శుద్ధి పద్ధతిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అప్పటినుంచి వీరి మధ్య ఏర్పడిన అనుబంధం పెళ్లి వరకూ వెళ్లిందని టాక్.

Samantha Shocking Decision After Marriage With Raj Nidimoru

సమంత – రాజ్ నిడిమోరుల పరిచయం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ద్వారా మొదలైంది. ఈ సిరీస్‌కు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే కలిసి దర్శకత్వం వహించారు. సమంత పోషించిన రాజీ పాత్రకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో పాటు, ఈ ప్రాజెక్ట్‌ వీరి మధ్య ప్రొఫెషనల్ బాండ్‌ను మరింత బలపరిచింది.

అయితే తాజాగా సమంత తన భర్త రాజ్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ అనే ఫ్యామిలీ, యాక్షన్, డ్రామాగా తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ టైటిల్ కార్డులో సమంత తన పేరును ‘సమంత నిడిమోరు’గా మార్చుకోబోతోందని సమాచారం.

గతంలో చైతన్యతో పెళ్లి తర్వాత తన పేరును ‘సమంత అక్కినేని’గా మార్చుకున్న సామ్, ఇప్పుడు రెండో భర్త ఇంటి పేరును తన పేరు పక్కన చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ఆమె అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

Post a Comment

Previous Post Next Post