కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు.. భారత్ లేకపోతే ప్రపంచ క్రికెట్‌కు కష్టమే!

టీమిండియా ప్రపంచ క్రికెట్‌లో మంచి బలమైన జట్టుగా ఉంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా ప్రపంచంలోని ప్రముఖ క్రికెట్ బోర్డుల్లో ఒకటిగా కొనసాగుతోంది. బీసీసీఐ దగ్గర భారీగా నిధులు ఉండటంతో పాటు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ను విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐకు మంచి ప్రాధాన్యత ఉంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో కూడా భారత క్రికెట్ బోర్డు మాటకు ఎంతో విలువ ఉంటుంది. బీసీసీఐ ఆర్థికంగా బలంగా ఉండటం, టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేయడం భారత క్రికెట్‌కు మరింత గుర్తింపు తీసుకొస్తున్నాయి.

Kevin Pietersen comments on Team India and BCCI’s influence on world cricket

ఈ నేపథ్యంలో టీమిండియా, బీసీసీఐపై మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ పాత్ర చాలా ముఖ్యమని ఆయన అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ వ్యవస్థ భారత్‌పై చాలా వరకు ఆధారపడి ఉందని చెప్పారు. భారత్ లేకపోతే ప్రపంచ క్రికెట్‌కు పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పీటర్సన్ అభిప్రాయపడ్డారు. బీసీసీఐ ఆర్థికంగా బలంగా ఉండటం, టీమిండియాకు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉండటంతో క్రికెట్‌లో భారత్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

అంతెకాదు అసలు ఇండియా లేకపోతే క్రికెట్ వ్యవస్థ అంతరించిపోయే ప్రమాదం కూడా ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు కెవిన్ పీటర్సన్. వాళ్ల ద్వారా చాలా క్రికెట్ బోర్డులు మ‌నుగ‌డ కొనసాగిస్తున్నాయని కూడా పేర్కొన్నారు.భారతదేశం నుంచి వచ్చే భారీ పెట్టుబడులు, ప్రసార హక్కులు (యూర్‌షిప్/బ్రాడ్‌కాస్టింగ్), మరియు స్పాన్సర్‌షిప్‌లు లేకపోతే అంతర్జాతీయ క్రికెట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడుతుందని ఐపీఎల్ కారణంగా చాలా మంది యంగ్ స్టార్స్ అంతర్జాతీయ క్రికెట్ లోకి వస్తున్నారని గుర్తు చేశారు. రంజి ట్రోఫీ లో కంటే ఐపీఎల్ ఆడడం బెస్ట్ అన్నారు కెవిన్ పీటర్సన్.

Post a Comment

Previous Post Next Post

Contact Form