మలయాళ నటి మమిత బైజు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘డ్యూడ్’, ‘జన నాయకన్’ వంటి చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది
అయితె కొన్ని విషయాలు పంచుకుంది ఈ బ్యూటి 2015లో సూర్య ఓ కార్యక్రమం కోసం కొచ్చి వచ్చారు. అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. మా అన్నయ ఇంటర్ చదువుతున్నాడు అన్న మరియు తన స్నేహితులు కలిసి సూర్య ని కలవడానికి వెళ్ళారు నెను వెళ్త అంటె తన తల్లిదండ్రులకు పంపించలెదని కాని ఇప్పుడు సూర్యతో కలిసి పనిచేసే అవకాశం రావడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నట్లు మమిత చెప్పింది
మమిత బైజు మాట్లాడుతూ.. సూర్య చాలా మంచి నటుడని, ఆయనతో కలిసి పనిచేయడం తనకు గొప్ప అనుభవమని పేర్కొంది. గతంలో అభిమానిగా సూర్యను చూసిన తాను.. ఇప్పుడు ఆయనతో కలిసి సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.
విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇందులో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మమిత బైజు హీరోయిన్‌గా కనిపించనుంది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
