MS Dhoni: ధోనీని ఇలా ఉపయోగిస్తే సీఎస్కేకు మరింత లాభం.. బద్రీనాథ్ సలహా

మహేంద్ర సింగ్ ధోనీకి వయసు పెరుగుతున్న కొద్దీ ఫిట్‌నెస్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. ఈ కారణంగా ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగిస్తే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు గత సీజన్ లో ధోని ఆడిందే లేదు కండరాల నొప్పి కారణంగా పొయిన సీజన్ లో ఒక్క మ్యాచ్ లొ కూడా ఆడలేదు అయితె ధోని గురించి కొన్ని ఆసక్తికరమయిన విషయాలను చెన్నై మాజీ క్రికెటర్ బద్రీనాథ్ చెప్పారు

MS Dhoni Impact Player CSK Badrinath comments on Dhoni fitness and role

ముఖ్యంగా ధోనీ సాధారణంగా మ్యాచ్‌లో చివరి దశలోనే బ్యాటింగ్‌కు వస్తున్న విషయాన్ని బద్రీనాథ్ ప్రస్తావించాడు. చాలా సందర్భాల్లో 16వ ఓవర్ తర్వాత ధోనీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ప్రారంభం నుంచి వికెట్ కీపింగ్ చేయడం కంటే, ఇంపాక్ట్ ప్లేయర్‌గా అవసరమైన సమయంలో బ్యాటింగ్‌కు రావడం అతనికి సరైన ఎంపిక కావచ్చని తెలిపాడు.అయితె సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా గతంలో ఇదే విషయంపై ఆలోచించినట్లు బద్రీనాథ్ గుర్తు చేశాడు. ధోనీపై శారీరక ఒత్తిడిని తగ్గించి, అతని అనుభవాన్ని జట్టుకు అవసరమైన సమయంలో ఉపయోగించుకోవడం మంచి వ్యూహంగా ఉంటుందని పేర్కొన్నాడు.

ఈ విషయం పైన ధోనితో చర్చింనప్పుడు తను తను ఎలా అనడంతో నేను ఆశ్చర్యపోయాను వచ్చే సీజన్లో నేను కచ్చితంగా మంచి ఫిట్నెస్ తో మీ ముందుకు వస్తా అది ఇంపాక్ట్ ప్లేయర్ కాకుండా మ్యాచ్ మొత్తం ఆడతాను వికెట్ల వెనుక నుండి తన జట్టును నడిపిస్తానని ధోని అన్నారు తన మాటలు విని ఆశ్చర్యపోయానని బద్రీనాథ్ అన్నారు దినిబట్టి చూసుకుంటె ధోనిని వచ్చె సిజన్ కచ్చితంగా చూస్తామని తెలుస్తుంది.

Post a Comment

Previous Post Next Post

Contact Form