2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.పుల్వామా దాడికి ప్రతిస్పందనగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 26, 2019న పాకిస్తాన్‌లోని బాలాకోట్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదుల శిక్షణ స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసింది. ఈ ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.దీని మరుసటి రోజైన ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళం కూడా భారత సైనిక ప్రాంతాల వైపు రావడానికి ప్రయత్నించింది. దీంతో భారత వైమానిక దళం అప్రమత్తమై పాక్ విమానాలను అడ్డుకునేందుకు యుద్ధ విమానాలను రంగంలోకి దించింది.
అదే సమయంలో భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మిగ్-21 బైసన్ యుద్ధ విమానంతో పాక్ విమానాలను ఎదుర్కొనేందుకు వెళ్లారు. ఆ సమయంలో జరిగిన వైమానిక పోరులో అభినందన్ చూపిన ధైర్యం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది అలాంటి విరుడు భారత వైమానిక దళానికి గుడ్‌బై చెప్పెశాడు అంతులేని ధైర్య సాహసాలతో భారత యుద్ధ విమానాన్ని నడిపి వీర్ చక్ర అవార్డు ను తన సొంతం చెసుకున్నా అభినందన్ వర్ధమాన్ ఇప్పుడు భారత వైమానిక దళానికి గుడ్‌బై చెప్పి ఓ కమర్షియల్ ఫ్లైట్ పైలట్‌గా చేరారు. గోవాకు చెందిన ఎఫ్‌ఎల్‌వై91 అనే విమానయాన సంస్థలో ఆయన గత ఆగష్టులోనే విధుల్లో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కమర్షియల్ విమానాలు నడిపే పైలట్‌గా పని చేస్తున్నారు. అది కుడా ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది దినికి గల కారణం ఇంకా తెలియదు ఎదిఏమి అయిన అలాంటి విరుడు ఇలా చెయడం బాధకారం అని చాల మంది అనడడం జరుగుతుంది
