విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు. ఎప్పటిలాగే తన బ్యాటింగ్‌లో అద్భుతమైన టైమింగ్, ఫుట్‌వర్క్ చూపించిన కోహ్లీ, ఈసారి అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా ‘నో లుక్ సిక్స్’ కొట్టి హడావుడి రేపాడు. బౌలర్ బంతి వేయగానే షాట్ పూర్తయ్యేలోపే, బాల్ ఎక్కడికి వెళ్తుందో చూడకుండానే సిక్స్ కొట్టడం ఆ క్షణాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది
గత కొన్ని మ్యాచ్‌లుగా కోహ్లీ తన పాత ఫామ్ సంపాదించుకుని, మరింత కాంఫిడెంట్‌గా ఆడుతున్నాడని ఈ షాట్ మరోసారి నిరూపించింది. సిట్యుయేషన్ ఏదైనా ఒత్తిడిని పట్టించుకోకుండా తన సహజ ఆడతీరు కొనసాగించడం కోహ్లీ ప్రత్యేకత.
విశాఖ స్టేడియంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మరింత స్పెషల్. షాట్ పడగానే స్టేడియం మొత్తం ఒకేసారి లేచిపోయి అరవడం, కోహ్లీ పేరు నినాదాలతో మారుమోగడం, ఆ క్షణాన్ని మరింత గ్రాండ్‌గా మార్చింది. చాలా మంది అభిమానులు ఈ దృశ్యాన్ని మొబైల్‌లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది మిలియన్ల వ్యూస్ సాధించింది.
