మనలో చాలామందికి ఇంటి భోజనం అంటే ముందుగా గుర్తుకొచ్చే ఫేవరెట్ వంటకం పప్పు కర్రీ. అందులోనూ టమాటా పప్పు అంటే చిన్నా-పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని టమాటా పప్పు కలిపితే ఆ రుచె వేరు.
అయితే, ఈ టమాటా పప్పును ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేసుకుంటుంటారు. కొందరు చాలా శ్రద్ధగా, అన్ని పదార్థాలు సరైన మోతాదులో వేసినా కూడా… “ఎందుకో రుచి పూర్తిగా రావట్లేదు” అని అనిపిస్తుంటుంది.అలాంటి వారికోసం ఈసారి తెలంగాణ స్టైల్ టమాటా పప్పు ఒకసారి ట్రై చేయండి.
![]() |
| getty images |
ఈ టమాటా పప్పు అసలు రహస్యం ఏంటంటే… చివర్లో వేసే ఒక స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్. అదే సరైన టైమ్‌లో, సరైన విధంగా ప్రిపేర్ చేసి పప్పులో కలిపితే రుచి ఒక్కసారిగా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పప్పు కలిపి తిన్నారంటే… ప్రతి ముద్దలోనూ అసలైన ఇంటి వంట రుచి, ఆత్మీయత స్పష్టంగా అనిపిస్తుంది.
ఇంకా మంచి విషయం ఏమిటంటే, ఈ టమాటా పప్పు తయారీకి ఎక్కువ టైమ్ తీసుకోదు. ఎక్కువ మసాలాలు, క్లిష్టమైన స్టెప్స్ అవసరం లేదు. సాధారణ కుక్కర్‌లోనే, అప్పటికప్పుడు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. బిజీగా ఉన్న రోజులలో కూడా ఈ పప్పు అయితే సులభంగా రెడీ అయిపోతుంది.
అయితే ఆలస్యం ఎందుకు? ఘుమఘుమలాడే వాసనతో, నోరూరించే రుచితో తయారయ్యే ఈ తెలంగాణ స్టైల్ టమాటా పప్పును ఇంట్లో సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్‌గా చూద్దాం… 😋
కావాల్సిన పదార్థాలు :
![]() |
| getty images |
తయారీ విధానం :
ఈ రెసిపీ మొదలు పెట్టేముందు ముందుగా కందిపప్పు ప్రిపరేషన్ చాలా ముఖ్యమైన స్టెప్. ఒక శుభ్రమైన బౌల్‌లో అవసరమైనంత కందిపప్పును తీసుకుని, రెండు మూడు సార్లు నీళ్లలో బాగా కడగాలి. పప్పులో ఉండే ధూళి, స్టార్చ్ పూర్తిగా పోయేలా కడగడం వల్ల పప్పు మరింత సాఫ్ట్‌గా ఉడుకుతుంది.
తర్వాత పప్పు పూర్తిగా మునిగేంత నీళ్లు పోసి కనీసం గంట పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది, కుక్కర్‌లో తక్కువ గ్యాస్‌తోనే బాగా మెత్తగా అవుతుంది. అంతేకాదు, పప్పు సహజ రుచి మరింత బాగా బయటకు వస్తుంది
పప్పు నానేలోపు రెసిపీలోకి కావాల్సిన టమాటాలను శుభ్రంగా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని పక్కనుంచాలి. ఉల్లిపాయలను కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి
ఇప్పుడు బాగా నానిన పప్పును వాటర్ వడకట్టి కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులో రెండున్నర కప్పుల మంచి నీళ్లు పోసి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
అందులో కొద్దిగా కరివేపాకు, అవసరమైనంత పసుపు, రుచికి సరిపడా కారం, అలాగే కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు అన్ని పదార్థాలు ఒకదానితో ఒకటి బాగా కలిసేలా ఒకసారి నెమ్మదిగా కలపాలి.
ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే… వాటర్ లెవల్. వేసిన పదార్థాలన్నీ పూర్తిగా మునిగేంత నీరు ఉండాలి. అలా ఉంటే పప్పు సమానంగా ఉడుకుతుంది, మసాలాల రుచి కూడా బాగా పప్పులోకి చేరుతుంది.
ఆ తర్వాత కుక్కర్ మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు ఒక చిన్న గిన్నెలో చింతపండును తీసుకుని శుభ్రంగా కడిగి, ఆపై అదిగి మునిగే వరకు వాటర్ పోసి కాసేపు నానబెట్టుకోవాలి.
ఇందుకోసం మిక్సీ జార్ తీసుకుని అందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ప్రత్యేకమైన మసాలా పేస్ట్ వేసుకోడం ద్వారా టమాటా పప్పు చాలా టేస్టీగా వస్తుంది.
ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి ఒక కప్పు పరిమాణంలో చిక్కని గుజ్జును తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
అనంతరం పప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాత కుక్కర్‌లోని ప్రెషర్ పూర్తిగా పోయే వరకు ఆగాలి. ప్రెషర్ మొత్తం తగ్గిన తర్వాతే మూత తీసి, అందులో ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి–జీలకర్ర పేస్ట్ను వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా కలపాలి.
ఇప్పుడు పప్పుగుత్తి సహాయంతో పప్పును బాగా మెత్తగా మెదుపుతూ, అన్ని పదార్థాలు ఒకటిగా కలిసేలా చేసుకోవాలి అలాగని, మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడా పప్పు పలుకులు కాస్త కనిపించేలా మాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత అందులో ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు, పప్పు కన్సిస్టెన్సీకి తగినన్ని నీళ్లు పోసుకుని ఒకసారి బాగా కలపాలి.వాటర్ యాడ్ చేసిన తర్వాత పప్పు కన్సిస్టెన్సీ మరీ చిక్కగా, పలుచగా కాకుండా గరిటె జారుడుగా ఉండేలా చూసుకోవాలి. అనంతరం అందులోకి పోపును సిద్ధం చేసుకోవాలి.
తళింపు
తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.అవి కాస్త వేగాక ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు, ఇంగువ వేసి పోపును మంచిగా ఫ్రై చేసుకోవాలి.
తాలింపు చక్కగా వేగిందనుకున్నాక అందులో ముందుగా మాష్ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి నాలుగైదు నిమిషాలు మరిగించుకుని చివర్లో కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే చాలు.
తెలంగాణ స్టైల్‌లో ఘుమఘుమలాడే టమాటా పప్పు నిమిషాల్లోనే రెడీ అయి మీ ముందుంటుంది!ఇప్పటివరకు మీరు ఎప్పుడూ చేసుకునే సాధారణ పద్ధతికి కాస్త బ్రేక్ ఇచ్చి, ఈసారి తప్పకుండా ఈ స్టైల్‌లో టమాటా పప్పును ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం… ఇకపై ఇదే మీ ఇంటి ఫేవరెట్ వెర్షన్‌గా మారిపోతుంది

