Rohit Sharma Record: వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు – క్రిస్ గేల్ రికార్డు బ్రేక్

Flash News

న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోని తొలి వన్డే మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన ప్రత్యేకతను చాటాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఇతర ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనతను రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ భారీ స్కోర్ చేయకపోయినా, తన చిన్న ఇన్నింగ్స్‌తోనే ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనతను సాధించాడు.ఈ మ్యాచ్‌లో క్రీజ్‌పై ఉన్న కొద్ది సమయంలోనే తన క్లాస్, పవర్‌ను చూపించిన హిట్‌మ్యాన్, కీలక సిక్సర్లతో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

300x250 Advertisement
Advertisement

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 29 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ రెండు సిక్సర్లతో, అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లను చేరుకున్నాడు. ప్రపంచంలో ఈ మైలురాయిని చేరుకున్న మొదటి బ్యాట్స్‌మన్ అయ్యాడు.

Monetag Ad Clone
Advertisement
ⓘ ⋮

ఇప్పుడు అతను వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. రోహిత్ ఖాతాలో ప్రస్తుతం 329 సిక్సర్లు ఉండగా, 328 సిక్సర్లు బాదిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌ను అతను అధిగమించాడు.

ఈ రికార్డుతో హిట్‌మ్యాన్ తన పవర్ హిట్టింగ్‌కు మరో ముద్ర వేశాడు. ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌలర్లపై దాడి చేయగల సామర్థ్యం రోహిత్ ప్రత్యేకత. మ్యాచ్‌కు మ్యాచ్‌కు తన స్టైల్‌తో అభిమానులను అలరించే రోహిత్, సిక్సర్ల విషయంలో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

Discover

  • rohitsharma
  • ⭐Most sixes in one ODI cricket
  • Post a Comment

    Previous Post Next Post

    Contact Form