ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఒక మొబైల్ నెంబర్ బాగా వైరల్ అవుతోంది. అదే 9881193322. ముఖ్యంగా రీల్స్, షార్ట్స్, ఫ్యాక్ట్స్ వీడియోలలో ఈ నెంబర్‌ను చూపిస్తూ “ఇది చాలా ఉపయోగపడే నెంబర్” అంటూ వివరిస్తున్నారు. దీంతో చాలామంది ఈ నెంబర్ అసలు ఏమిటి? ఎందుకు వైరల్ అవుతోంది? అనే ఆసక్తి చూపిస్తున్నారు.
9881193322 ఎందుకు వైరల్ అవుతోంది?
సోషల్ మీడియాలో వచ్చిన అనేక వీడియోల ప్రకారం, ఈ నెంబర్ ప్రయాణికులకు ఉపయోగపడే ఒక హెల్ప్ నెంబర్‌లా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా రైల్వే ప్రయాణాలకు సంబంధించిన సమస్యలపై దీనిని ఉపయోగించవచ్చని కొన్ని వీడియోల్లో పేర్కొంటున్నారు. ఈ కారణంగా చాలామంది ఈ నెంబర్‌ను గమనించి, సేవ్ చేసుకుంటున్నారు.
భారతదేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తుంటారు. అయితే రైలులో ప్రయాణిస్తున్నప్పుడు శుభ్రత, భద్రత, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి సమస్యలు ఎదురవడం చాలా సాధారణం. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో రైల్వే ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే ఒక ముఖ్యమైన నెంబర్ ఉంది. అదే 9881193322.
9881193322 నెంబర్ ప్రత్యేకత ఏమిటి?
ఈ నంబర్ ను సేవ్ చేసుకొని వాట్సాప్ ద్వారా హాయ్ అని పంపించినట్లయితే కొన్ని సర్వీసెస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది మనం ఇక్కడ నుండే ట్రైన్ టికెట్ బుకింగ్ మరియు రిటర్న్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు.
వీటితోపాటు ట్రైన్ పిఎన్ఆర్ టేషన్ స్టేటస్ తో పాటు కోచ్ పొజిషన్ కూడా తెలుసుకోవచ్చు రైల్వేలో దొరికి ఫుడ్ కూడా ఇక్కడ నుండి ఆర్డర్ పెట్టుకోవచ్చు.మీరు ప్రయాణించే ట్రైన్ లో ఏదైనా ఇబ్బంది మీకు కలిగిన ఇక్కడ నుండే కంప్లైంట్ చేయవచ్చు ఇలా కంప్లైంట్ చేసిన వెంటనే రైల్వే అధికారులు మీ వద్దకు వచ్చి ఆ సమస్య పరిష్కరిస్తారు.
ట్రైన్స్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఈ నెంబర్ సేవ్ చేసుకోవడం చాలా మంచిది
