ఇంటర్వ్యూలో ఓపెన్ అయిన తేజస్వి రావు – ఫస్ట్ కిస్ గురించి చెప్పింది ఇదే|Viral Interview News

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతూ సంచలనంగా మారిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. విడుదలకు ముందు పెద్దగా ప్రచారం లేకుండా, ఎలాంటి భారీ అంచనాలు లేకుండానే థియేటర్లలోకి వచ్చిన ఈ చిన్న సినిమా ఇప్పుడు ప్రేక్షకుల మన్ననలు పొంది బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతోంది. కథలోని సింప్లిసిటీ, సహజమైన ఎమోషన్స్, వినోదాత్మక సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాలో కథానాయికగా నటించిన తేజస్వి రావు తన ఫ్రెష్ లుక్‌ మరియు సహజమైన నటనతో అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ఎమోషనల్ సీన్స్‌లోనే కాదు, లైట్ హార్ట్‌డ్ సన్నివేశాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. దీంతో ఆమె నటన సినిమాకే హైలైట్‌గా నిలిచిందని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి రావు తన ఫస్ట్ కిస్‌కు సంబంధించిన ఓ సరదా జ్ఞాపకాన్ని పంచుకుంది. తాను ఫస్ట్ క్లాస్‌లో చదువుతున్న రోజుల్లో తన పక్కన కూర్చున్న ఓ అబ్బాయి పొరపాటున ఎరేజర్‌ని కింద పడేశాడట. దాన్ని తీసివ్వమని చెప్పడంతో తాను బెంచ్ కిందకు వంగగా, ఆ సమయంలో అతడూ బెంచ్ కిందకు వచ్చి తన బుగ్గపై కిస్ చేశాడని నవ్వుతూ చెప్పింది.

ప్రస్తుతం తేజస్వి రావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఫస్ట్ క్లాస్ లోనే ఇలాంటి ఘటన జరిగిందా.. ? అది ఇంకా గుర్తుందా అంటూ రియాక్ట్ అవుతున్నారు.

×
Website Monetization Ad

Post a Comment

Previous Post Next Post

Contact Form