ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేకపోతే సాధారణ జీవితం కూడా కష్టంగా మారుతోంది. బ్యాంక్ అకౌంట్ తెరవడం నుంచీ, కేవైసీ ప్రక్రియ పూర్తిచేయడం, ట్రైన్ లేదా బస్సు టికెట్లు బుక్ చేయడం వరకూ చాలా పనులకు ఆధార్ అవసరమవుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయింది
అదే విధంగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు వివిధ సహాయాలు, సామాన్యులకు ఆరోగ్య పథకాలు వంటి సేవలు కూడా ఆధార్ ఆధారంగానే అందుతున్నాయి. కొన్ని చోట్ల ఆఫీసులు, ఇతర అవసరాల కోసం కూడా ఆధార్ చూపించాలని కోరుతున్నారు. హోటళ్లలో గదులు తీసుకోవడం, మొబైల్ సిమ్ పొందడం, ఇతర సేవలు వినియోగించుకోవడం కోసం ఆధార్ ముఖ్యమైన పత్రంగా మారింది.
కేవలం ఆధార్ కార్డును ఆధారంగా చేసుకుని జనన ధృవీకరణ పత్రాలు జారీ చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొంటూ, అలా జారీ చేసిన పత్రాలను ఇక చెల్లవని ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇప్పటికే విడుదల చేసినట్లు సమాచారం.
భవిష్యత్తులో జనన ధృవీకరణ పత్రాలు జారీ చేసే సమయంలో సంబంధిత అధికారిక రికార్డులు, ఆసుపత్రి వివరాలు, ఇతర అవసరమైన పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
