నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్‌లో అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అదే ఎనర్జీతో, అదే జోష్‌తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ దశలో ఆయన సినిమాల ఫలితాలు, బాక్సాఫీస్ వసూళ్లు, అభిమానుల స్పందన చూసుకుంటే తన తోటి అగ్ర కథానాయకుల కంటే ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు
అఖండ’ సినిమా నుంచి బాలయ్యకు తిరుగులేని సక్సెస్ మొదలైంది. ఆ సినిమా ఇచ్చిన జోష్‌తో వరుసగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకూ మహారాజ్’ వంటి సినిమాలతో వరుసగా హిట్లు కొట్టి తన మార్కెట్‌ను మరింత పెంచుకున్నారు. ముఖ్యంగా ప్రతి సినిమాలోనూ కొత్తదనం, పవర్‌ఫుల్ పాత్రలు కనిపించడం ఆయన బలంగా మారాయి.
ఇప్పుడు అందరి దృష్టీ ఆయన రాబోయే సినిమాలపైనే ఉంది. త్వరలో విడుదల కాబోతున్న ‘అఖండ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం స్థాయిని మించి ఈ భాగం ఉంటుందని అభిమానులు నమ్ముతున్నారు. దీని తర్వాత మరో భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామాలో నటించేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
వరుస విజయాలతో దూసుకుపోతూ టాలీవుడ్‌లో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరుస్తున్నారు. అభిమానుల విశ్వాసం ప్రకారం, ఈ దశలో మరోసారి డబుల్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమనేలా ఆయన ప్రయాణం సాగుతోంది.
బాలయ్య పారితోషికం
వాస్తవానికి బాలయ్య పారితోషికం విషయంలో ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించిన వ్యక్తి కాదు. తనతో సినిమా చేసే నిర్మాతకు ఎలాంటి భారం పడకూడదన్న ఆలోచన ఆయనలో ముందుగా ఉంటుంది. సినిమా మొత్తం బడ్జెట్, ఖర్చులు, లాభనష్టాలు అన్నీ చూసుకుని నిర్మాతలు ఎంత ఇస్తే అంతే తీసుకునే స్వభావం బాలయ్యది.
నిర్మాతలు ఇస్తే కాదనలేని పరిస్థితిలో ఆయన తీసుకుంటున్నారే తప్ప, డిమాండ్ చేసి తీసుకున్నట్టుగా కాదు. తాజాగా చేయబోయే కొత్త సినిమాకు ఆయన సుమారు రూ.45 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
