కేరళలోని కోయిలాండిలో మత్స్యకారుల వలకు కోట్ల విలువైన తిమింగలం వాంతి (ఆంబర్‌గ్రిస్) చిక్కింది. వారు దాన్ని వెంటనే కోస్టల్ పోలీసులకు అప్పగించారు. అయితే… ఎందుకు తిమింగలం వాంతి ఇంత భారీ ధరకు అమ్ముడవుతుంది? ఆంబర్‌గ్రిస్ అనేది తిమింగలం జీర్ణక్రియలో సహజంగా ఏర్పడే అరుదైన పదార్థం. సముద్రంపైకి తేలుతూ సంవత్సరాల తరబడి సూర్యకాంతి, ఉప్పు నీటి ప్రభావాల వలన ఇది విలువైన ఘన పదార్థంగా మారుతుంది. దీనిలో ఉండే ప్రత్యేకమైన సువాసన మరియు రసాయనిక గుణాలు దీన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన పదార్థాలలో ఒకటిగా నిలిపాయి.
అయితే ఇటీవల కేరళలోని కోజికోడ్ జిల్లా కోయిలాండీ సముద్రతీరంలో మత్స్యకారుల వలలో కోట్ల రూపాయల విలువైన తిమింగల వాంతి (Ambergris) చిక్కింది. ఇది అత్యంత అరుదుగా లభించే సముద్ర వనరుగా పరిగణిస్తారు. గురుకులం బీచ్ సమీపంలో మత్స్యకారులు చేపల కోసం వలలు వేస్తే ఆంబర్‌గ్రిస్ పడింది.
మత్స్యకారులు సురేష్, బైజు అనే ఇద్దరి యజమాన్యంలోని “గెలాక్సీ” అనే బోటులో చేపల వేటకు వెళ్లగా ఈ విలువైన పదార్థం వలలో చిక్కింది. వారు వెంటనే ఇది విలువైనదని గుర్తించి కోయిలాండీ కోస్టల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
div class="tag-box"> Big fish in sea Baroda Sea Goldతిమింగల వాంతి లేదా ఆంబర్‌గ్రిస్ అనేది స్పెర్మ్ వేల్ అనే తిమింగల జాతి జీర్ణ వ్యవస్థలో సహజంగా ఏర్పడే మృదువైన, మైనంలాంటి, కొవ్వు స్వభావం గల పదార్థం. సాధారణంగా తిమింగలం స్క్విడ్ వంటి జీవులను తింటుంది. వాటిలోని స్క్విడ్ బెక్కులు మరియు జీర్ణం కాని భాగాలు ఆంతరాల్లో గుచ్చుకునే ప్రమాదం ఉండటంతో, తిమింగలం వాటిని రక్షణాత్మక పొరతో కప్పి, బయటకు పంపే సమయంలో ఈ ఆంబర్‌గ్రిస్ ఏర్పడుతుంది.
Discover
సముద్రంలోకి వచ్చాక ఇది సూర్యరశ్మి, ఉప్పు నీరు, గాలుల ప్రభావంతో క్రమంగా గ్యాస్‌లు తగ్గి, కఠినమై, విలువైన ఘన పదార్థంగా మారుతుంది. మొదట దీనికి బలమైన వాసన ఉంటే, కాలక్రమంలో అది మృదువైన, అరుదైన సువాసనగా మారుతుంది
తిమింగల వాంతి లేదా ఆంబర్‌గ్రిస్ అనేది స్పెర్మ్ వేల్ అనే తిమింగల జాతి జీర్ణ వ్యవస్థలో సహజంగా ఏర్పడే మృదువైన, మైనంలాంటి, కొవ్వు స్వభావం గల పదార్థం. సాధారణంగా తిమింగలం స్క్విడ్ వంటి జీవులను తింటుంది. వాటిలోని స్క్విడ్ బెక్కులు మరియు జీర్ణం కాని భాగాలు ఆంతరాల్లో గుచ్చుకునే ప్రమాదం ఉండటంతో, తిమింగలం వాటిని రక్షణాత్మక పొరతో కప్పి, బయటకు పంపే సమయంలో ఈ ఆంబర్‌గ్రిస్ ఏర్పడుతుంది.
సముద్రంలోకి వచ్చాక ఇది సూర్యరశ్మి, ఉప్పు నీరు, గాలుల ప్రభావంతో క్రమంగా గ్యాస్‌లు తగ్గి, కఠినమై, విలువైన ఘన పదార్థంగా మారుతుంది. మొదట దీనికి బలమైన వాసన ఉంటే, కాలక్రమంలో అది మృదువైన, అరుదైన సువాసనగా మారుతుంది
అయితే ఈ వాంతిని ప్రపంచవ్యాప్తంగా “Floating Gold” (తేలే బంగారం) అని పిలుస్తారు. దీని నుండి వచ్చే సువాసన పదార్థాలు పర్ఫ్యూమ్ తయారీలో ఉపయోగిస్తారు. ఎక్కువగా మెడిసిన్స్ లో వాడడంతో ఒక కేజీ కోటి రూపాయల వరకు ఉండడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ అంతేకాదు ఇది దొరకడం కూడా చాలా రేర్ గా దొరుకుతుంది
DisCover
