మీరు ఇప్పటివరకు చాలా రకాల రోటీ పచ్చళ్లను ట్రై చేసి ఉంటారు. కానీ పచ్చి బొప్పాయితో పచ్చడి ఎప్పుడైనా చేసి చూసారా? నిజం చెప్పాలంటే చాలా మందికి ఈ పచ్చడి గురించి కూడా తెలీదు.చాలా మంది దీనిని ఎప్పుడూ ట్రై చేయరు, ట్రై చేయాలనే ఆలోచన కూడా చేయరు. నిజానికి, ఈ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి చేస్తేనే తెలుస్తుంది!
taste super pappaya Nice Pickleపచ్చి బొప్పాయి పచ్చడి అంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది కానీ చేయడంలో మాత్రం చాలా ఈజీ, చాలా ఫాస్ట్. కేవలం కొన్ని నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. రొటీన్‌గా చేసే పచ్చళ్లలో ఇదొక కొత్త రుచి. ముఖ్యంగా, ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుంటే అసలు తినడం ఆపలేం.
ఆరోగ్యపరంగా కూడా ఇది ఒక మంచి పచ్చడి. బొప్పాయిలో ఉన్న పీచు, విటమిన్లు, డైజెషన్‌కు హెల్ప్ అయ్యే గుణాలు బాడీకి చాలా ఉపయోగపడతాయి.
కావాల్సిన పదార్థాలు :
రెండు కప్పులు - పచ్చి బొప్పాయి తురుము
ఒక టేబుల్‌స్పూన్ - నూనె
ఒకట్రెండు - ఉల్లిపాయలు
ఆరేడు - పచ్చిమిర్చి
ఒక స్పూన్ - ఆవాలు
ఒక స్పూన్ - మెంతులు
ఒక చెంచా - జీలకర్ర
రుచికి తగినంత - ఉప్పు
కొద్దిగా - కరివేపాకు
ఒక స్పూన్ - శనగపప్పు
ఒక చెంచా - మినప్పప్పు
ఒక స్పూన్ - వెల్లుల్లి తరుగు
కొద్దిగా - బెల్లంపొడి
ఒక స్పూన్ - నిమ్మరసం
తయారీ విధానం :
ముందుగా పచ్చి బొప్పాయిని పీలర్తో చెక్కు తీసుకుని శుభ్రంగా కడగాలి. తర్వాత కావాల్సిన పరిమాణంలో సన్నగా తురుముకుని రెడీగా ఉంచుకోవాలి.
Instant Pickle Easywayఅలాగే, ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లితరుగు, పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.
తరువాత స్టవ్ మీద కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించాలి.
అవి లైట్గా వేగాక కరివేపాకు, ఎండుమిర్చి తుంపలు, ఇంగువ, వెల్లుల్లి తరుగు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేయాలి.
పచ్చిమిర్చి ముక్కలు మంచిగా వేగిన తర్వాత పసుపు, మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, అల్లం ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
తాలింపు మిశ్రమం చక్కగా వేగాక అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిబొప్పాయి తురుమును వేసి మధ్యమధ్యలో గరిటెతో కలియతిప్పుతూ లో-ఫ్లేమ్లో పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
తరువాత ఆ మిశ్రమంలో బెల్లంపొడి, కారం, నిమ్మరసం యాడ్ చేసి ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ తీపి నచ్చనివాళ్లు బెల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు.
తర్వాత సన్నని మంటపై ఒకటి రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తే చాలు — అంతే! కొత్త రుచితో, నోరూరించే బొప్పాయి పచ్చడి చాలా సింపుల్‌గా, వెంటనే రెడీ అయిపోుతుంది!
ఇది మీకు నచ్చితే ఒక్కసారి రొటీన్ పచ్చళ్లను పక్కన పెట్టి వెరైటీగా బొప్పాయి పచ్చడి చేసి చూడండి. తినే వాళ్లందరూ “ఇది పచ్చి బొప్పాయితో చేశారా?” అని ఆశ్చర్యపడేంత రుచిగా ఉంటుంది. ఇంట్లో పెద్దలు, పిల్లలు—అందరూ ఈ కొత్త రుచిని బాగా ఎంజాయ్ చేస్తారు
