మనలో చాలామంది ఆధార్ కార్డ్ విషయంలో ఈ సమస్యలను ఎదుర్కొనే ఉంటారు.అడ్రస్ వివరాలు సరిగా ఉండకపోవడం లేదా ఆధార్ కార్డులోని ఫొటో స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆ సమస్యలను ఎలా సరిదిద్దుకోవాలి అనే విషయం చాలామందికి తెలియదు.మన దేశంలో ఆధార్ కార్డు (Aadhar Card) తప్పనిసరి ఐడెంటిటీ కార్డుగా మారిపోయింది.
UIDAI జారీ చేసే 12 అంకెల ఆధార్ నంబర్ ఈ రోజుల్లో దాదాపు ప్రతి అవసరానికి తప్పనిసరి అయింది. బ్యాంక్ ఖాతా ఓపెనింగ్ నుంచి ప్రభుత్వ పథకాలు, సిమ్ కార్డు, పాన్ కార్డు లింకింగ్ వరకు అనేక సేవలకు ఆధార్‌ను ప్రధాన గుర్తింపు పత్రంగా ఉపయోగిస్తున్నారు. అందుకే ఆధార్ కార్డులోని వివరాలు పూర్తిగా సరిగ్గా ఉండటం చాలా అవసరం.
అయితే, కొన్నిసార్లు టెక్నికల్ లోపాలు లేదా పాత సమాచారం కారణంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా చిరునామా వివరాలు తప్పుగా ఉండటం, లేదా ఆధార్‌లో ఉన్న ఫొటో స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతున్న సాధారణ సమస్యలే. ఈ కారణంగా వెరిఫికేషన్ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశమూ ఉంటుంది.
![]() |
| source:uidai |
సాధారణంగా ఆధార్ కార్డులోని కొన్ని వివరాలను ఆన్‌లైన్‌లో ఎడిట్ చేసుకోవచ్చు. అయితే, ఫొటోను మాత్రం సొంతంగా మార్చడానికి వీలుండదు. ఈ ఎడిట్ కోసం కంపల్సరీగా ఆధార్ సేవా కేంద్రాన్ని విజిట్ చేయాల్సిందే. ఫొటో అప్‌డేషన్ కావాలంటే లైవ్‌లో దిగిన ఫొటోను వాడాలి. పాత లేదా పర్సనల్ ఫొటోలను సబ్మిట్ చేస్తే UIDAI యాక్సెప్ట్ చేయదు. అందుకోసమే, ఆధార్ యూజర్లు తమ ఫొటోను ఛేంజ్ చేసుకోవడానికి ఆధార్ సెంటర్ వరకు వెళ్లాలి.
Aadharupdate
ఆధార్ వివరాల అప్‌డేట్ కోసం UIDAI ప్రత్యేకంగా ఫీజును నిర్ణయించింది. ఆధార్ కార్డులో ఫొటోను అప్‌డేట్ చేయాలంటే రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై జీఎస్టీ కూడా వర్తిస్తుంది.ఫొటో అప్‌డేట్ చేయడానికి ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు.కాబట్టి, మీ ఆధార్ నంబర్‌తో నేరుగా సమీప ఆధార్ సెంటర్‌కు వెళ్లి ఫొటో మార్పు చేయించుకోవచ్చు. అక్కడే మీ లైవ్ ఫొటో తీసి వెంటనే అప్డేట్ ప్రాసెస్ ప్రారంభిస్తారు.
ఫొటో అప్డేట్ చేసిన తర్వాత మార్పులు తక్షణమే ఆధార్ కార్డులో కనిపించవు. UIDAI వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాకే అప్‌డేట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సాధారణంగా ఈ ప్రక్రియ 30 రోజుల్లోగా పూర్తవుతుంది. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదా అధిక అప్లికేషన్ల సమయంలో గరిష్టంగా 90 రోజుల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంటుంది

