భారత్ – సౌతాఫ్రికా మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా డీఆర్‌ఎస్ విషయంలో ఆయన తీసుకున్న చురుకైన నిర్ణయాలు మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది.
సౌత్ ఆఫ్రికా బ్యాటర్ల చాలా దూకుడుగా ఆడుతూ ఆల్మోస్ట్ మ్యాచ్ దగ్గర్లో వికెట్లు కోల్పోవడం జరుగుతూ వచ్చింది .ఆఖరి 10 ఓవర్లలో భారత బౌలర్లు కట్టడి చేసి మ్యాచ్‌ని తమవైపు తిప్పుకున్నారు. 16 ఓవర్లకు సౌతాఫ్రికా ఏడు కీలక వికెట్లు కోల్పోయినా.. ఇంకా క్రీజులో మార్కో యాన్సన్, కార్బిన్ బాష్ ఇద్దరూ ఉన్నారు. వన్డే సిరీస్ రెండో మ్యాచ్‌లో ఈ ఇద్దరే 351 పరుగుల భారీ స్కోర్ ఛేజింగ్‌లో కీలక పాత్ర పోషించారు. దాంతో ఈ రెండు వికెట్లు భారత్‌కు కీలకమయ్యాయి.
16వ ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి.. జార్జ్ లిండే వికెట్ తీసినప్పటికీ, అదే ఓవర్‌లో మార్కో యాన్సన్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది, గెలుపుపై ఆశలు పుట్టించాడు. ఆఖరి నాలుగు ఓవర్లకు సౌతాఫ్రికా విజయానికి 55 పరుగులు అవసరమయ్యాయి. యాన్సన్ - బాష్ కాసేపు నిలబడి ఉంటే మ్యాచ్ ఫలితం తారుమారు అయ్యుండేది.
సంజు శాంసన్ డీఆర్ఎస్ రివ్యూ వీడియో వైరల్ – భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ టర్నింగ్ పాయింట్
17వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన బుమ్రా మొదటి బంతినే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేశాడు. షాట్ ఆడేందుకు ప్రయత్నించగా అది మిస్సయింది.అయితే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ మార్కో యాన్సన్ ఎల్ బి డబ్ల్యు అవుట్ కావడం జరిగింది అయితే ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. అయితే రివ్యూ తీసుకోవడానికి కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అంతగా ఆసక్తి చూపించలేదు.
కానీ వికెట్ల వెనక నుండి గమనించిన సంజు అది అవుట్ అయ్యే అవకాశం ఉంది మనకి రెండు రివ్యూలు ఉన్నాయని సూర్య ని కన్విస్ చేయడం వల్ల సూర్య వెంటనే రివ్యూ కి వెళ్ళాడు. టిఆర్ఎస్ లో బ్యాట్స్మెన్ అయితే అవుట్ కావడం జరిగింది. ఒకవేళ రివ్యూ తీసుకోకపోతే భారత్ కొంచెం కష్టాలు పడే అవకాశం ఉండేది.
