ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వివిధ శాఖలకు సంబంధించిన సేవలను ఇళ్ల నుంచే పొందవచ్చు. ఈ విధానం వల్ల సమయం ఆదా కావడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అంతేకాదు పోలీస్ సేవలు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తోంది.
ఈ సంక్రాంతి వచ్చేలోపు మరిన్ని సేవలను ఈ యాప్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి సేవలను డిజిటల్ చేయడం ద్వారా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగవలసిన పని ఉండదు ప్రతి పని జస్ట్ ఒక్క మెసేజ్ తో అయిపోతుంది.
పోలీస్ సేవలను కూడా వాట్సాప్ గవర్నెన్స్‌లో చేర్చారు. ఎఫ్ఐఆర్, ట్రాఫిక్ చలాన్ వివరాలను వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ వాహనంపై ఉన్న ట్రాఫిక్ చలాన్లను తెలుసుకుని చెల్లింపులు చేయవచ్చు. ఈ సేవల కోసం 9552300009 నెంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
ఈ నెంబర్ను మీ ఫోన్లో సేవ్ చేసుకొని వాట్సాప్ ద్వారా భీఖి అని మెసేజ్ పంపాలి. దీంతో మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ సేవలు తెలుగులో కావాలనుకుంటే.. టీఈ అని టైప్ చేయాలి. తెలుగు భాషలోకి మారుతుంది. ఆ తర్వాత సేవను ఎంచుకోండిపై క్లిక్ చేయాలి. అనంతరం వచ్చిన సేవల్లో పోలీస్ శాఖ సేవలు ఎంచుకోవాలి. ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ స్టేటస్, ఈ-చలాన్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
ఈ చలాన్ ఆప్షన్ ను ఎంచుకుని మీ వెహికల్ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మీ వెహికల్ మీద ఉన్న చలాన్లు కనిపిస్తాయి ఒకవేళ చలాన్లు కానీ మీ వెహికల్ మీద లేనట్లయితే No challan found అని వస్తుంది.
#WhatsAppGovernance #APGovernment #AndhraPradesh #DigitalGovernance #GovtServices #PoliceServices #eGovernance #DigitalIndia #PublicServices