రైతుల భూమి హక్కులను మరింత పారదర్శకంగా, స్పష్టంగా చేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ కార్యక్రమం గ్రామ స్థాయిలో నిర్వహించే గ్రామసభల ద్వారా అమలు చేయబడుతోంది. జనవరి 9వ తేదీ వరకు ఈ పంపిణీ కొనసాగనుండగా, అర్హులైన రైతులకు నూతన డిజైన్‌తో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను అధికారికంగా అందజేయనున్నారు.
🛞AP New Pattadar Pass Books
భూమి వివరాలు, సర్వే నెంబర్లు, విస్తీర్ణం, యజమాని సమాచారం వంటి అంశాలను పూర్తిగా డిజిటలైజ్ చేసి, తప్పిదాలు లేకుండా నమోదు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. దీని ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందడంలో మరింత సౌలభ్యం కలుగుతుందని అధికారులు తెలిపారు.
