హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో కర్రీ పాయింట్స్ స్టార్ట్ చేసి అప్పట్లో భారీగా హల్‌చల్ చేసిన కమెడియన్ కిర్రాక్ ఆర్పీ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అయ్యాడు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ చేపల పులుసు గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఆసక్తి ఉన్నవారికి ఫ్రాంఛైజీలను కూడా ఇవ్వడంతో ఈ బిజినెస్‌పై మరింత హైప్ ఏర్పడింది. ఒకవైపు ఆర్టిస్ట్‌గా తన కెరీర్ కొనసాగిస్తూనే, మరోవైపు ఫుడ్ బిజినెస్‌లో కూడా కిర్రాక్ ఆర్పీ యాక్టివ్‌గా కనిపించాడు. అయితే, మంచి నడుస్తున్నట్టుగా కనిపించిన ఈ చేపల పులుసు కర్రీ పాయింట్స్ ఒక్కసారిగా క్లోజ్ కావడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది
![]() |
| Kirak RP |
ప్రత్యేకంగా ఈ చేపల పులుసు కోసం బయట వ్యక్తులను తీసుకువచ్చి వంట చేయించేవాడని అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ పులుసు కోసం ప్రత్యేకమైన మసాలాలను బయట నుంచి తెప్పించేవాడని కూడా తెలిసింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఫుడ్ మైంటైన్ చేయడంతో, అప్పట్లో ఫుడ్ లవర్స్ ఈ పులుసు రుచి చూడటానికి క్యూ కట్టారు.
అయితే, ఈ చేపల పులుసుపై మిక్స్‌డ్ రివ్యూస్ కూడా వచ్చాయి. కొందరు “కర్రీ అంతగా టేస్ట్ లేదు” అని కామెంట్స్ చేయగా, మరికొందరు “రేటు ఎక్కువగా ఉంది” అంటూ విమర్శించారు. అయినప్పటికీ, ఆర్పీ మాత్రం ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోకుండా వరుసగా కొత్త బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తూ హడావిడి చేశాడు.
బిజినెస్‌కు పబ్లిక్‌లో మంచి రెస్పాన్స్ రావడంతో, కొత్త బ్రాంచ్‌లు స్టార్ట్ చేయగానే ఫ్రాంఛైజీ తీసుకోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. అన్నీ బాగానే సాగుతున్నట్టు కనిపించిన ఈ వ్యాపారాన్ని కిర్రాక్ ఆర్పీ మధ్యలోనే మానేయడం అప్పట్లో అభిమానులకు షాక్ ఇచ్చింది.
kirak RP: కారణం ఇదే
ఈ విషయంపై అప్పటివరకు ఆర్పీ ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. అయితే, ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం ఈ వ్యవహారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. తనకు రాజకీయాల్లో ఉండడం చాలా ఇష్టమని, అదే సమయంలో టీడీపీ నుంచి పిలుపు రావడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టానని ఆర్పీ వెల్లడించాడు.
ఫుడ్ బిజినెస్ తన జీవితంలో ఒక భాగమేనని చెబుతూ, ఒకవైపు రాజకీయాలు, మరోవైపు బిజినెస్ చూసుకోవడంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండడంతోనే ఈ చేపల పులుసు వ్యాపారాన్ని వదిలేశానని తెలిపాడు. తన జీవితం పూర్తిగా రాజకీయాలకు అంకితం అని, ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగా పనిచేస్తానని కిర్రాక్ ఆర్పీ స్పష్టం చేశాడు.
