టాలీవుడ్‌లో స్క్రీన్‌పై మాయ చేసిన ఈ జంట ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక్కటవుతోంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించి అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా జంట ఇప్పుడు రియల్ లైఫ్‌లో భార్యాభర్తలు కాబోతున్నారు. చాలా కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందన్న వార్తలు వినిపిస్తుండగా, ఈ పెళ్లితో వాటికి ఫుల్ స్టాప్ పడింది.
టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాలు రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే విజయ్-రష్మికల పెళ్లి నేపథ్యంలో ప్రస్తుతం ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ ప్రతిచోట ట్రెండింగ్‌లో నిలుస్తోంది. విజయ్, రష్మికల పాత ఫోటోలు, వీడియోలను బయటకు తీస్తూ వారికి సంబంధించిన ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలో అసలు విజయ్-రష్మికల విద్యార్హతలు ఎవరు ఎంత వరకు చదువుకున్నారు? అనే అంశంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
రష్మిక మందన్నా తన స్కూల్ విద్యను కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేసింది. ఆ తర్వాత బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ఇదొక్కటే కాదు, సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లిష్ లిటరేచర్‌లో కూడా డిగ్రీ పూర్తి చేసింది రష్మిక.
ఇక విజయ్ దేవరకొండ విద్యార్హతల విషయానికి వస్తే, అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాదులోని భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నుంచి బీకాం డిగ్రీ పట్టా అందుకున్నాడు. అంటే ఇద్దరూ గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ డిగ్రీల పరంగా చూస్తే విజయ్ కంటే రష్మిక కొంచెం ముందున్నారని చెప్పవచ్చు.
