నిన్న జరిగిన IND vs ZIM మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర వైఫల్యంతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఆ ఓటమిని గురించి మేము ఎక్కువగా ఆలోచించలేదని, ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి ముందుకు సాగుతున్నామని సూర్య తెలిపారు.
ఆ మ్యాచ్ వీడియోలను ప్రత్యేకంగా పరిశీలించామని, మేము చేసిన తప్పిదాలను విశ్లేషించుకున్నామని చెప్పారు. ఎవరు ఎక్కడ తప్పు చేశారో గుర్తించి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేశామని తెలిపారు. ఆ విశ్లేషణ తరువాత జట్టులో ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడిందని, ఆ ఆత్మవిశ్వాసంతోనే జింబాబ్వేతో మ్యాచ్‌కు దిగామని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
అభిషేక్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి రావడం చాలా ఆనందంగా ఉందని సూర్య అన్నారు. ఈరోజు జట్టు చేసిన బ్యాటింగ్ చాలా బాగుందని, దిగిన ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేశారని చెప్పారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించారని ఆయన ప్రశంసించారు.
కీలక సమయంలో జట్టును వదిలిన రింకూ.. అసలు కారణం ఏమిటి?
అయితే బౌలింగ్ ప్రదర్శన మాత్రం కొంచెం బలహీనంగా అనిపించిందని సూర్య స్పష్టం చేశారు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్‌తో పాటు శివం దూబే చేసిన బౌలింగ్ అంతగా సంతృప్తికరంగా లేదని చెప్పారు. తదుపరి మ్యాచ్‌లో ఈ తప్పులను సరిదిద్దుకుని మరింత మెరుగ్గా ఆడతామని తెలిపారు.
ఈ మ్యాచ్‌లో కేవలం రెండు ఓవర్లు వేసిన శివం దూబే 46 పరుగులు ఇవ్వడం గమనార్హం. అలాగే బుమ్రా బౌలింగ్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. మూడు ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చారు. మొత్తంగా గెలిచినా బౌలింగ్ విభాగంలో మెరుగుదల అవసరమని ఈ మ్యాచ్ స్పష్టం చేసింది.
