యూపీఐ పేమెంట్స్ వినియోగం రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. చిన్నపాటి కిరాణా సరుకుల కొనుగోలు నుంచి పెద్ద మొత్తాల మనీ ట్రాన్స్‌ఫర్ వరకు ప్రతి లావాదేవీలో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది. నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, కేవలం మొబైల్ ఫోన్‌తో కొన్ని సెకన్లలోనే చెల్లింపులు పూర్తి చేయగలగడం వల్ల ప్రజలు విస్తృతంగా దీనిని ఉపయోగిస్తున్నారు.
టీ స్టాళ్లు, ఆటో చార్జీలు, షాపింగ్ మాల్స్, ఆన్‌లైన్ ఆర్డర్లు, విద్యుత్ బిల్లులు, మొబైల్ రీచార్జ్‌లు ఇలా దాదాపు అన్ని రంగాల్లో యూపీఐ ప్రధాన చెల్లింపు విధానంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు విస్తరించడంతో చిన్న వ్యాపారులు సైతం క్యూ ఆర్ కోడ్‌ల ద్వారా చెల్లింపులు స్వీకరిస్తున్నారు. అయితే ఒకవేళ సిమ్ కార్డ్ బ్లాక్ అయిన సందర్భంలో యూపీఐ పేమెంట్స్ పనిచేస్తాయా? అనే ప్రశ్న అందరిలొ ఉంటుంది.
యూపీఐ పేమెంట్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, రోజు వారి కిరణా సరుకుల కొనుగోలు నుండి మనీ ట్రాన్స్‌ఫర్ వరకు ఎన్నో సందర్భాల్లో యూపీఐను రెగ్యులర్‌గా ఉపయోగిస్తారు. అయితే సిమ్ కార్డ్ బ్లాక్ అయిన సందర్భంలో యూపీఐ పేమెంట్స్ పనిచేస్తాయా? అనే విషయం తెలుసుకుందాం!
👉Chandra Grahan 2026: ఇండియాలో టైమింగ్స్ ఇవే – తప్పక తెలుసుకోండి!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేజ్ (UPI) అనేది సిమ్ బేస్డ్ వెరిఫికేషన్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎమ్ ప్రకారం, సిమ్ కార్డు బ్లాక్ చేయబడినా లేదా ఇనాక్టివ్‌గా ఉన్న సందర్భంలో యూపీఐ పనిచేయదు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో SMS బేస్డ్ వెరిఫికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్, అథెంటికేషన్ చేసిన తర్వాత యూపీఐ పేమెంట్స్ పనిచేస్తాయి. యూపీఐ సర్వీసెస్ ఉపయోగించాలంటే బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయబడిన నంబర్ తప్పనిసరిగా ఉండాలి.
సిమ్ కార్డు బ్లాక్ చేయబడిన, ఇనాక్టివ్‌గా ఉన్న లేదా పనిచేయని సందర్భంలో ఎలాంటి ఈ ట్రాన్సాక్షన్స్ చేయలేరు. యూపీఐ సేవలు ఉపయోగించాలంటే యాక్టివ్ సిమ్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
