ఇంతకాలం టాలీవుడ్ అభిమానులను ఉత్కంఠలో ఉంచిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఎట్టకేలకు తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని రూమర్లను నిజం చేస్తూ, వారు ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో పీటలెక్కనున్నట్లు చెప్పారు.
టాలీవుడ్ స్టార్‌లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం సమీపిస్తోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుంది. ఈ ప్రత్యేక వేడుకలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు మరియు దగ్గరి బంధువులు మాత్రమే హాజరు కానున్నారు. మార్చ్ 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. రిసెప్షన్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు, మిత్రులు మరియు అభిమానులు పాల్గొంటారంట.
ఇక ఇప్పటివరకు తమ ప్రేమ, పెళ్లి పై సైలెంట్ గా ఉన్న విజయ్, రష్మిక ఎట్టకేలకు ఆదివారం (ఫిబ్రవరి 22) రాత్రి తమ గ్రాండ్ వెడ్డింగ్ పై అధికారిక ప్రకటన విడుదల చేశారు. అభిమానుల కోరిక మేరకు తమ పెళ్లి వేడుకకు ‘విరోష్’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు విజయ్, రష్మికల పాత ఫోటోలు, వీడియోలను బయటకు తీస్తూ వారికి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ టాలీవుడ్ ప్రేమ పక్షులను విష్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా విజయ్ దేవరకొండ పేరెంట్స్ తమకు కాబోయే కోడలికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. విజయ్ నటించిన ఒక సినిమా సక్సెస్ మీట్‌లో యాంకర్ సుమ.. విజయ్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ అతని పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. మాకు ఎలాంటి కోడలు రావాలని కోరుకుంటారు అని విజయ్ తల్లి మాధవిని సుమ అడిగినప్పుడు, ఆమె తనకు ఒకే ఒక కండిషన్ ఉందని చెబుతుంది. ‘మా బాబుని మంచిగా చూసుకునే కోడలు వస్తే చాలు. ఆమె అతన్ని బేషరతుగా ప్రేమించాలి అంతే’ అని విజయ్ తల్లి మాధవిని అన్నారు.
అలాగే, ‘నాకు కులం, మతం వంటి పట్టింపులు లేవు. అతను ఒక భారతీయురాలిని, ముఖ్యంగా ఒక దక్షిణాది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది’ అని చెప్పారు.
దానితో విజయ్ తల్లి మాధవిని #tagమాధవిని సోషల్ మీడియాలో పోష్టులు పెడుతూ వాళ్ళ సంతోషాన్ని తెలియజేస్తున్నారు.
