(APSRTC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహిళల ఉచిత ప్రయాణ పథకం అమలును మరింత సమర్థవంతంగా చేసేందుకు సంస్థ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతోంది. విద్యార్థినులు, ఉద్యోగినులు, స్వయం ఉపాధి మహిళలు ఈ పథకం ద్వారా పెద్ద ఎత్తున లాభపడుతున్నారు.
ఈ నేపథ్యంలో పథకం అమలుపై ప్రజల నుంచి, ప్రయాణికుల నుంచి ప్రత్యేక ఫీడ్‌బ్యాక్ సేకరిస్తోంది APSRTC. బస్సుల సంఖ్య పెంపు, రద్దీ నియంత్రణ, టైమ్ టేబుల్ మెరుగుదల, సౌకర్యాల విస్తరణ వంటి అంశాలపై వచ్చిన సూచనలను పరిశీలిస్తోంది. అవసరమైతే కొత్త మార్గాలు ప్రవేశపెట్టి, అదనపు సర్వీసులు కూడా నడపాలని యోచిస్తోంది.
అంతేకాదు తాజాగా ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పీఎం-ఈబస్ సేవ పథకం కింద కేంద్రం రాష్ట్రంలోని 11 నగరాల్లో ఏపీఎస్‌ఆర్టీసీకి 750 విద్యుత్ బస్సులను కేటాయించింది. ఇందులో భాగంగా రవాణా శాఖ అధికారులు విజయవాడకు 100 బస్సులు కేటాయించారు.
త్వరలోనే ఈ బస్సులు రోడ్డు పైకి రానున్నాయి. వీటిల్లోనూ స్త్రీశక్తి పథకం అమలుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
