pakistan team :ఓటమితో మూడో స్థానానికి పాక్..అలా జరిగితె సెమీస్ ఖాయం!

ICC Men's T20 World Cup 2026 సూపర్-8 పోరు మంచి పోటాపోటీగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా ముగుస్తోంది. అలాగే నిన్న జరిగిన పాకిస్థాన్ మరియు ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా చివరి వరకూ తీవ్ర పోటీగా సాగింది. పాకిస్థాన్ మంచి పోరాటం చేసినప్పటికీ చివర్లో ఓటమి తప్పలేదు. ఈ పరాజయంతో పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ సెమీస్‌కు చేరే అవకాశాలు ఇంకా పూర్తిగా ముగియలేదు.

Pakistan cricket team disappointed after loss to England in Super 8

బుధవారం పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో పాకిస్థాన్ మూడో స్థానానికి పడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలు కష్టమని కొందరు భావిస్తున్నా, మరికొందరు మాత్రం కొన్ని సమీకరణాలు కుదిరితే పాక్ సులభంగా ముందుకు వెళ్లవచ్చని చెబుతున్నారు. ఆ లెక్కలేమిటో ఇప్పుడు చూద్దాం.

సూపర్-8లో భాగంగా పాకిస్థాన్‌కు శ్రీలంకతో జరిగే ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఇంగ్లాండ్ ఫిబ్రవరి 27న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా శ్రీలంకపై గెలవాలి. అంతేకాకుండా ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కూడా అనుకూలంగా రావాలి.

పాకిస్థాన్ సెమీస్‌కు చేరే అవకాశాలు ఇవి:

శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడిపోవాలి. అప్పుడు పాయింట్ల పట్టికలో సమీకరణాలు మారి, పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశం ఉంటుంది.

ఒకవేళ న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిస్తే, తర్వాతి మ్యాచ్‌లో తప్పక ఓడిపోవాలి. అప్పుడు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది. అందువల్ల శ్రీలంకపై పాక్ భారీ పరుగుల తేడాతో గెలవాలి.

T20 World Cup 2026 Super 8 points table Pakistan third place

పాక్-శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే పాకిస్థాన్‌కు 2 పాయింట్లు వస్తాయి. ఇదే సమయంలో శ్రీలంక-న్యూజిలాండ్ మ్యాచ్ కూడా వర్షంతో రద్దవ్వాలి. అలాగే న్యూజిలాండ్ ఇంగ్లండ్ చేతిలో ఓడాలి. అప్పుడు మూడు జట్లు సమాన పాయింట్లతో ఉంటాయి. ఆ పరిస్థితిలో మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న జట్టు సెమీస్‌కు చేరుతుంది.

ఈ మూడు అవకాశాల్లో ఒకటి లేదా రెండు సాధ్యమే అనిపిస్తున్నా, మూడోది మాత్రం కాస్త కష్టంగా కనిపిస్తోంది. చూడాలి మరి పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుతుందో లేదో.

Post a Comment

Previous Post Next Post

Contact Form