తెలుగు సినీ రంగంలో ‘నటసింహం’గా, ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు. ఒక వైపు రాజకీయంగా తన తండ్రి పెట్టిన తెలుగు దేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సాధించి ప్రస్తుతం తిరుగులెని ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు సినిమాల్లో కూడా వరుసగా ఐదు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతుంది. NBK111 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్నా ఈ సినిమా పైన భారీ అంచనాలు అయితె ఉన్నాయి. అయితె రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ కూడా చేశారు. అంతే కాకుండా బాలయ్య సినిమాకి మరోసారి తమన్ సంగీతం అందించబోతున్నారు. హీరోయిన్‌గా నయనతార ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, వీర సింహారెడ్డి హిట్ కొట్టడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాలకృష్ణ - కొరటాల శివ కాంబోలో రావడంతొ బాలయ్య పోషించబోయే పాత్రపై కొన్ని సందేహాలున్నాయి. అయితె కొత్తగా విడుదల చేసిన పోస్టర్ లో ఇందులో బాలకృష్ణ ఒక పవర్‌ఫుల్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించడంతో నందమూరి అభిమానులు పూనకాలతో చక్కర్లు కొడుతున్నారు. ‘భరత్ అనే నేను’లో మహేష్ బాబును సీఎంగా చూపించిన కొరటాల, ఇప్పుడు బాలయ్య మార్క్ మాస్ ఎలివేషన్లతో ఆ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దబోతున్నారట. అందుకు తగ్గట్టు గానే సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌పై కూడా "Power Meets Purpose, Mass Becomes A Movement" అనే ట్యాగ్‌లైన్ ఉండడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. హిట్ పక్కాగా వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
