ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రయాణం ముగిసింది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓడిపోయింది. తమ సొంత గ్రౌండ్ అయిన చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు అదరగొట్టారు. ముందుగా బౌలర్లు ముంబై బ్యాటర్లను ఎక్కువ పరుగులు చేయకుండా ఆపారు. కేవలం 159 పరుగులు చేసింది. ఆరంభంలో ముంబై బాగా రాణించినా వరుసగా వికెట్లు పడడంతో 200 పరుగులు అనుకున్నారు కాని హార్దిక్ చెత్త బ్యాటింగ్ కారణంగా 185 కూడా చేయలేకపోయింది.
అయితే ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. టోర్నీలో మిగిలిన 5 మ్యాచ్‌లకు 5 గెలిచినా ముంబై ఇండియన్స్ ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ 7 పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. అద్భుతం జరిగితే తప్పా ముంబై ఇండియన్స్ టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.
విఫలం అవుతున్న స్టార్లు
హార్దిక్ పాండ్యా జిడ్డు బ్యాటింగ్‌తో జట్టుకు నష్టం చేశాడు. 23 బంతులు ఆడిన హార్దిక్ 18 పరుగులే చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (21), తిలక్ వర్మ (5), విల్ జాక్స్ (1) వైఫల్యం కూడా ముంబై ఇండియన్స్ విజయావకాశాలను దెబ్బతీసింది.
ఎంతో కీలకమైన బౌలర్లు బుమ్రా మరియు బోల్ట్ ఫామ్ కోల్పోవడం కూడా వరుస ఓటములకు కారణంగా చెప్పుకోవచ్చు.
