రవితేజ కి కొత్త రికార్డు కేవలం ఐదు రోజుల్లో సినిమా పూర్తి చేసిన హీరోగా రవితేజ

మాస్ మహారాజు రవితేజ గురించి సినిమా పట్ల తనుకున్న ఇష్టం గురించి మనందరికీ తెలిసిందే. అయితే గతంలో తీసిన దొంగల ముఠా గురించి మీకు తెలుసా! రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రవితేజ, ఛార్మి, ప్రకాష్ రాజ్, లక్ష్మీ మంచు, బ్రహ్మానందం, సునీల్ కాంబినేషన్‌లో కేవలం 4.5 రోజుల్లో పూర్తి చేసి వర్మ రికార్డు సృష్టించారు.

Dongala Mutha film 2011 Ravi Teja Ram Gopal Varma scene

స్టార్ డైరెక్టర్లు పూరీ జగన్నాథ్ కో-డైరెక్టరుగా, హరీష్ శంకర్ అసోసియేట్ డైరెక్టరుగా దొంగల ముఠాకు పనిచేయడం విశేషం. ఈ సినిమాకు ఎటువంటి భారీ కెమెరాలు వాడకుండా కేవలం కానన్ 5D డిజిటల్ కెమెరాలతో, సహజ సిద్ధమైన వెలుతురులో చిత్రీకరించారు.

సాధారణంగా వందల మంది ఉండే సినిమా సెట్‌లో, కేవలం 7 నుండి 8 మంది సిబ్బందితోనే ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా, అతి తక్కువ సమయంలో సినిమాను ఎలా తీయవచ్చో నిరూపించిన ఒక గొప్ప సాంకేతిక ప్రయోగంగా నిలిచిపోయింది. ఇటువంటి ప్రయోగాలు చేయడంలో రాంగోపాల్ వర్మ తనకు తానే సాటి.

అయితే ఈ సినిమాకి 5 రోజులకు షూటింగ్ ఖర్చు రూ.6.5 లక్షలైంది. అమర్ మోహిలే బీజీఎం అందించారు. టైటిల్ సాంగ్ కు సత్యం సంగీతం అందించారు. షూటింగ్ పూర్తయిన తర్వాత కేవలం 33 రోజుల్లోనే థియేటర్లలోకి అడుగుపెట్టింది. 2011 మార్చి 18న విడుదలై మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.

Post a Comment

Previous Post Next Post

Contact Form