ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయం సాధించడం అభిమానులకు పెద్ద ఆనందాన్ని ఇచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో SRH జట్టు అద్భుత ప్రదర్శనతో గెలుపును కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన SRH జట్టు మంచి ఆరంభం సాధించింది. ఓపెనర్లు హెడ్ మరియు అభిషేక్ శర్మ మంచి పార్ట్నర్షిప్ అందించడంతో 200 ప్లస్ భారీ స్కోరును చేయగలిగింది ఎస్ఆర్హెచ్.
ట్రావిస్ హెడ్ 21 బంతుల్లో 46 పరుగులు చేసి వేగంగా ఆడగా, అభిషేక్ శర్మ 48 పరుగులతో చెలరేగాడు. ఈ ఇద్దరూ పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను SRH వైపు మళ్లించారు. ఆరంభంలో మంచి స్కోర్ లభించడంతో 250 కచ్చితంగా కొడతారని అందరూ అనుకున్నారు కానీ వరుస వికెట్లు పడడంతో 200 కూడా కష్టంగా అనిపించింది. కానీ నితీష్ కుమార్ రెడ్డి మరియు క్లాసెన్ కలిసి మంచి పార్ట్నర్షిప్‌ను నిర్మించి జట్టును మళ్లీ బలంగా నిలిపారు.
క్లాసెన్ 35 బంతుల్లో 52 పరుగులు చేయగా, నితీష్ కుమార్ రెడ్డి 39 పరుగులతో చక్కటి సహకారం అందించాడు. వీరి ఇన్నింగ్స్‌లతో SRH జట్టు 226 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది.
226 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన KKR జట్టు ఓపెనర్లు రహనే మరియు అలైన్ మంచి పార్ట్నర్షిప్‌ను అందించలేకపోయారు. మొదటి ఓవర్ నుంచే అలైన్ దూకుడుగా ఆడుతూ 25 పరుగులు సాధించాడు. అయితే తదుపరి ఓవర్లో స్పిన్నర్ బౌలింగ్‌లో అవుట్ కావడం జరిగింది.
SRH బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఫలితంగా KKR జట్టు 16 ఓవర్లలోనే 161 పరుగులకు ఆలౌట్ అయింది.
