నో ధోని నో జూనియర్ ఏబీడి చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందా? రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ పాయింట్

గత సంవత్సరం వరుస ఓటములతో ప్లే ఆఫ్ కూడా చేయలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే ఈ సంవత్సరం ప్లే ఆఫ్ చేరుకోవాలి అనే లక్ష్యంతో టీంలో కొన్ని మార్పులను చేసుకుంటూ వచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. కానీ మొదటి మ్యాచ్‌లోనే జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. సీనియర్ ఆటగాడు మరియు వికెట్ కీపింగ్‌లో కీలక పాత్ర పోషించే మాస్టర్ మైండ్ ధోని మొదటి మ్యాచ్‌కు దూరమవడం పెద్ద దెబ్బగా మారింది.

RR vs CSK IPL 2026 Prediction: Who will win today's Rajasthan Royals vs Chennai Super Kings match?

ఇది ఇలా ఉండగా, గత సంవత్సరం మంచి బ్యాటింగ్ చేసి ఈ సంవత్సరం మంచి ఫామ్‌లోకి వచ్చిన బ్రేవిస్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయం కారణంగా రాజస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆడడం లేదు. దీనితో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ కొంత బలహీనంగా మారే అవకాశం ఉంది.

రుతురాజ్ గైక్వాడ్ మరియు సంజు ఓపెనర్లుగా రాబోతున్నారు. వీరిద్దరూ పవర్ ప్లేలో కనీసం 50 పరుగులు అయినా రాబట్టగలిగితే, మిగిలిన బ్యాటర్లు తమ వంతు సహకారం అందిస్తే చెన్నై సూపర్ కింగ్స్ 180 ప్లస్ స్కోరు చేయగలుగుతుంది.

Pitch Report

రాజస్థాన్ రాయల్స్ (RR) మరియు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. పిచ్‌పై బౌన్స్ స్థిరంగా ఉండటంతో బ్యాటర్లు తమ షాట్లను సులభంగా ఆడగలుగుతారు. కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

మ్యాచ్ ప్రారంభంలో బంతి కొత్తగా ఉన్నప్పుడు ఫాస్ట్ బౌలర్లకు కొంత స్వింగ్ మరియు మూమెంట్ లభించే అవకాశం ఉంది. మొదటి కొన్ని ఓవర్లు దాటిన తర్వాత బ్యాటర్లు పరుగులు సులభంగా రాబట్టవచ్చు.

రాత్రి సమయంలో సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు (డ్యూ) ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మంచు వల్ల బంతి తడవడంతో బౌలర్లకు, ముఖ్యంగా స్పిన్నర్లకు, సరైన పట్టు దొరకదు. అందువల్ల ఛేజింగ్ చేసే జట్టుకు బ్యాటింగ్ మరింత సులభంగా మారుతుంది. ఈ పిచ్‌పై కనీసం 170 పైగా స్కోరు చేసినా మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు గెలుపు అవకాశాలు ఉంటాయి, అయితే సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకే కొంచెం ఎక్కువ సహకారం లభించే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post

Contact Form