UGC NET Score Card Download: ఫలితాలు వచ్చేశాయ్‌.. లింక్ ఇదే

News Scrolling Bar

UGC NET December 2025 Results విడుదల

యూజీసీ – నెట్‌ డిసెంబర్‌ 2025 పరీక్ష ఫలితాలు (UGC NET December 2025 Results) అధికారికంగా విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 31 నుంచి జనవరి 7 వరకు ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

UGC NET December 2025 results announced,

పరీక్ష పూర్తైన అనంతరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది.

ఫైనల్ ఆన్సర్ కీతో పాటు ఫలితాలు

అభ్యంతరాల పరిశీలన అనంతరం తాజాగా ఫైనల్ ఆన్సర్ కీతో పాటు ఫలితాలను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల ఆధారంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతలను నిర్ణయించనున్నారు.

UGC NET స్కోర్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ దరఖాస్తు నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదు చేసి స్కోర్ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

స్కోర్ కార్డులో ఈ వివరాలు ఉంటాయి:

  • పేపర్‌వైజ్ మార్కులు
  • పర్సెంటైల్ స్కోర్
  • అర్హత (Qualification) స్థితి

UGC NET 2025 – హాజరు & అర్హత గణాంకాలు

ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 9,93,702 మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకోగా, 7,35,614 మంది పరీక్షకు హాజరయ్యారు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం:

  • JRF + Assistant Professor అర్హత సాధించినవారు – 5,108 మంది
  • Assistant Professor + PhD Admissions54,713 మంది
  • కేవలం PhD అర్హత పొందినవారు – 1,17,058 మంది

UGC NET డిసెంబర్‌ 2025 ఫలితాలతో వేలాది మంది అభ్యర్థులకు JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు పీహెచ్‌డీ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.

Check Resuits :Click Here

Post a Comment

Previous Post Next Post

Contact Form