ఇండస్ట్రీలో తనదైన స్టైల్, న్యాచురల్ యాక్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో చంద్రశేఖర్ ఒకరు. 90స్ కాలంలో సినిమాలు చూసిన వారెవరికైనా ఆయన ముఖం చాలా సుపరిచితం. అప్పట్లో హీరోకి బెస్ట్ ఫ్రెండ్ పాత్ర అంటే ముందుగా గుర్తొచ్చేది చంద్రశేఖర్‌నే. అంతలా తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.
![]() |
| idream |
కామెడీ, ఎమోషనల్, సపోర్టింగ్ రోల్స్—ఏ పాత్ర ఇచ్చినా సహజంగా నటించి సినిమాకు బలం చేకూర్చే నటుడు ఆయన. హీరోకి అండగా నిలిచే స్నేహితుడిగా, కొన్ని సందర్భాల్లో కథను మలుపుతిప్పే కీలక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మరీ ముఖ్యంగా చంద్రశేఖర్ పేరు గుర్తు రాగానే.. రాజమౌళి సినిమాలే గుర్తొస్తాయి. బాహుబలి సిరీస్ తప్పితే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమాలో చంద్రశేఖర్ కనిపిస్తాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అన్ని సినిమాల్లో మంచి మంచి రోల్స్ చేశారు. సై సినిమాలో భిక్షూ యాదవ్ లాయర్‌గా, ఛత్రపతి సినిమాలో భద్రం క్యారెక్టర్‌లు ఆయన కెరీర్‌కు మంచి ఊపు తెచ్చిపెట్టాయి. మరీ ముఖ్యంగా ఛత్రపతిలో భద్రం క్యారెక్టర్ మాత్రం శేఖర్‌కు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే… ఈయన భార్య కూడా టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అవును… ఆమె మరెవరో కాదు నీల్య భవాని. నీల్య భవాని అనేక ప్రముఖ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా పండగ చేస్కో, కిక్ 2, సైరా నరసింహా రెడ్డి, జెంటిల్‌మ్యాన్, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిన్న పాత్రైనా, సపోర్టింగ్ రోల్ అయినా… స్క్రీన్‌పై తన ప్రెజెన్స్‌తో ప్రత్యేకంగా నిలిచే నటి ఆమె.
ఖమ్మం జిల్లాకు చెందిన నీల్య భవాని, సినిమా రంగంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, అదే ఇండస్ట్రీలో ఉన్న చంద్రశేఖర్‌ను ప్రేమించింది. ఆ ప్రేమ తర్వాత పెళ్లి బంధంగా మారి, ఈ ఇద్దరూ ఆదర్శ దంపతులుగా నిలిచారు.

