ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) రైతులకు ఆర్థిక భరోసా కల్పించే కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో ప్రతి ఏడాది మొత్తం రూ.6,000 నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో జమ అవుతాయి. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా (ప్రతి విడత రూ.2,000 చొప్పున) రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి పంపిస్తారు.
ఈ ఆర్థిక సహాయం విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులు, సాగు నిర్వహణ వంటి అవసరాలకు రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఇది పెద్ద ఊరటగా మారింది.
ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి మొత్తం రూ.6,000ను మూడు విడతలుగా, ప్రతి విడతకు రూ.2,000 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 21 విడతల నిధులను విజయవంతంగా విడుదల చేసి కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందించింది.
తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి మొదటి వారంలో 22వ విడత నిధులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక తేదీ లేదా ప్రకటనను ప్రభుత్వం ప్రకటించలేదు.
ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత మొదటి వారంలోనే దీనిపై అప్‌డేట్ రానుందని ప్రభుత్వ సంకేతాల ఆధారంగా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కోసం రైతుల ఎదురుచూస్తున్నారు.
