రోజూ ఇడ్లీ దోశలకేనా? ఈరోజు అక్కి రొట్టె ట్రై చేయండి

మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చేవి ఇడ్లీ, దోశ, వడ, బోండా లాంటి సాధారణ వంటకాలే. రోజూ అవే తింటూ కొంచెం బోర్ కూడా వచ్చి ఉంటుంది. అలాంటి సమయంలో రుచికరంగా, ఆరోగ్యకరంగా, కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే మీకోసం ఓ అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ తీసుకొచ్చాం. అదే కర్నాటక స్పెషల్ అక్కి రొట్టె.

Traditional Soft Akki Rotti Recipe for Breakfast

బియ్యప్పిండితో తయారయ్యే ఈ అక్కి రొట్టె చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వంటి సింపుల్ పదార్థాలతో చేయొచ్చు కాబట్టి ఎక్కువ సమయం కూడా పట్టదు. ముఖ్యంగా ఉదయం హడావుడిగా ఉండే సమయంలో కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 3
సోయా కూర - పావు కప్పు
కరివేపాకు - 2 రెమ్మలు
క్యాప్సికం - సగం ముక్క
కొబ్బరి ముక్కలు - 2 టేబుల్​స్పూన్లు
అల్లం ముక్క - చిన్నది
బియ్యప్పిండి - 2 కప్పులు
జీలకర్ర - 1 టేబుల్​స్పూన్​
క్యారెట్​ - 1(చిన్నది)
కొత్తిమీర - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:

ఈ అక్కిరొట్టెకు కావాల్సిన పదార్థాలను ముందుగా ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సోయాకూర, కరివేపాకు, క్యాప్సికం వీలైనంత సన్నగా కట్​ చేసుకోవాలి.

అదే విధంగా కొబ్బరిని, క్యారెట్​పై పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి. అలాగే అల్లం ముక్క, కొత్తిమీరను కూడా సన్నగా కట్​ చేసుకోవాలి.

Healthy South Indian Akki Rotti Recipe

వెడల్పాటి మిక్సింగ్ బౌల్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సోయాకూర, క్యాప్సికం, కరివేపాకు, కొబ్బరి ముక్కలు, అల్లం తరుగు వేసుకోవాలి. తరువాత వీటిని చేతులతో లేదా స్పూన్‌తో ప్రెస్ చేస్తూ సుమారు 5 నిమిషాల పాటు బాగా కలపాలి, అలా చేస్తే కూరగాయల నుంచి వచ్చే సహజ రుచి బయటికి వచ్చి మిశ్రమం మరింత టేస్టీగా మారుతుంది.

ఇలా పదార్థాలు అన్నీ కలిసేలా మిక్స్​ చేసుకున్నాక బియ్యప్పిండి, జీలకర్ర, క్యారెట్​ తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి మరోసారి అంతా కలిసేలా మిక్స్​ చేసుకోవాలి.

ఇప్పుడు వేడినీటిని కొద్దికొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. పిండి పూర్తిగా పర్ఫెక్ట్‌గా తయారైన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మరో 5 నిమిషాల పాటు బాగా కలపాలి. అనంతరం బౌల్‌కు మూత పెట్టి కొద్దిసేపు పక్కన ఉంచితే, పిండి మెత్తగా మారి రొట్టెలు మరింత బాగా తయారవుతాయి.

అరగంట తర్వాత మరోసారి కలిపి కాస్త ఎక్కువగా పిండిని తీసుకుని పెద్ద సైజ్​లో ఉండలాగా చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఉండలుగా చేసి పక్కన ఉంచాలి.

అరటి ఆకు మీద నెయ్యి లేదా నూనె అప్లై చేసి ఓ ఉండను ఉంచి చేతి వేళ్లతో వెడల్పాటి చపాతీ సైజ్​లో ప్రెస్​ చేసుకోవాలి.

స్టవ్​ ఆన్​ చేసి దోశ పెనం పెట్టి హీట్​ చేసుకోవాలి. కాగిన పెనం మీద ప్రిపేర్​ చేసుకున్న రొట్టెనువేసి అంచుల వెంబడి నూనె అప్లై చేసి లో టూ మీడియం ఫ్లేమ్​లో కాల్చుకోవాలి.

ఈ విధంగా రొట్టెను రెండు వైపులా ఎర్రగా, బాగా కాల్చుకున్నాక తీసి ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పేపర్ లేదా అరటాకు మీద ఉంచి చేతులతో నొక్కి రొట్టె ఆకారంలో చేసుకుని, ఒక్కొక్కటిగా కాల్చుకుంటూ ప్లేట్‌లోకి తీసుకోవాలి.

ఇలా తయారుచేసుకున్న అక్కి రొట్టెలను వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సుతిమెత్తగా ఉంటాయి. ఈ విధంగా సులువుగా తయారయ్యే కర్ణాటక స్పెషల్ అక్కి రొట్టె పూర్తిగా రెడీ. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేయొచ్చు కాబట్టి, నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.

More From Jyoamma

Post a Comment

Previous Post Next Post

Contact Form