న్యూజిలాండ్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) చేసిన బ్యాటింగ్‌పై యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో అభిషేక్ ఆడిన తీరును యువరాజ్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ కేవలం 14 బంతులలోనే ఆప్ సెంచరీ చేసి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపాడు. ఈ ప్రదర్శనపై స్పందించిన యువరాజ్ సింగ్, “అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి. నిర్భయంగా ఆడటం, బంతిని గట్టిగా హిట్ చేయడంలో అతనికి మంచి నైపుణ్యం ఉంది. పవర్‌ప్లేలో ఇలాంటి బ్యాటర్ ఉండటం టీమ్‌కు చాలా ప్లస్ పాయింట్” అని అన్నాడు.
అభిషేక్ శర్మ ఆట తీరు గురించి తన గురువైన యువరాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్ని జన్మలెత్తినా నా రికార్డును బ్రేక్ చేయలేవంటూ అభిషేక్ శర్మను సరదాగా కామెంట్ చేయడం జరిగింది.
అయితే గతంలో అభిషేక్ శర్మ కోచ్, లెజెండ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కేవలం 12 బంతులలో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అంతేకాదు అదే మ్యాచ్లో ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ కొట్టిన రికార్డుతో పాటు 12 బంతులలో 50 పరుగులు చేసి ఫాస్టెస్ట్ 50 రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
అయితే తర్వాత జరిగే మ్యాచ్లో అయినా తన గురువు రికార్డును బ్రేక్ చేస్తాడా లేదో చూడాలి.
