నిపుణులు సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్ ద్వారా వచ్చే ఏపీకే (APK) ఫైల్ లింకులను ఎప్పుడూ క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.ఈ లింకులను తెరిచినపుడు, హ్యాకర్లు మీ ఫోన్ పై పూర్తి నియంత్రణ తీసుకొని మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు మీ పర్సనల్ డేటాను తీసుకున్న అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి.
![]() |
| source:Printerest |
వాట్సప్ హ్యాక్ అయితే వచ్చే సంకేతాలు
మీ ఫోన్ ఎక్కువగా హ్యాంగ్ అవడం ఓవర్ హీట్ కావడం ఫోన్ బ్యాటరీ అస్తమాను తగ్గిపోవడం వంటి సంకేతాలను చూడవచ్చు
వాట్సాప్ హ్యాక్ అయిందనిపిస్తే తీసుకోవాల్సిన ముఖ్య చర్యలు
1. వాట్సాప్‌ను వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయండి వాట్సాప్ హ్యాక్ అయిందని అనుమానం వచ్చిన వెంటనే యాప్‌ను పూర్తిగా తొలగించాలి.
2. మళ్లీ అధికారిక గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి అన్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే వాట్సాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆపై మీ మొబైల్ నెంబర్‌తో వెరిఫై చేసుకోవాలి.
3. టూ–స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఆన్ చేయండి టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేస్తే, మీకు తెలియకుండా ఎవరూ మీ వాట్సాప్ అకౌంట్ లోగిన్ అయ్యే అవకాశం ఉండదు. ఇది అదనపు భద్రతగా పనిచేస్తుంది.
4. కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్‌ని డిసేబుల్ చేయండి సెట్టింగ్స్‌లోకి వెళ్లి కాల్ ఫార్వర్డ్ ఆప్షన్లు ఎక్కడైనా అనుమానాస్పదంగా యాక్టివ్ గా ఉంటే వెంటనే ఆఫ్ చేయాలి. హ్యాకర్లు OTPలు మరియు కాల్స్ దారి మళ్లించడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
5. ‘Install from Unknown Sources’ ఆప్షన్‌ను డిసేబుల్ చేయండి ఏపీకే ఫైళ్లు, అనధికారిక యాప్స్ ఫోన్‌లోకి రావడాన్ని ఇది పూర్తిగా నిరోధిస్తుంది. ఈ ఆప్షన్ ఆఫ్ చేస్తే మీ ఫోన్ మరింత సేఫ్ గా ఉంటుంది.
