సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం, మనం పుట్టిన తేదీ మన జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ముఖ్యంగా నెలలో కొన్ని ప్రత్యేకమైన తేదీలలో జన్మించిన వారు పుట్టుకతోనే అదృష్టవంతులుగా భావించబడతారు. వీరికి ధనం, సంపద, ఐశ్వర్యం సహజంగానే ఆకర్షితమవుతుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతారు.
ఈ తేదీల్లో పుట్టిన వారికి జీవితంలో డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదని, కష్టసమయంలోనూ ఆర్థికంగా నిలబడే శక్తి ఉంటుందని విశ్వాసం. వ్యాపారం, ఉద్యోగం, పెట్టుబడులు వంటి రంగాలలో వీరు సులభంగా విజయం సాధిస్తారు. కొంతమంది అనుకోని అవకాశాల ద్వారా సంపన్నులుగా మారితే, మరికొందరు కష్టపడి కోటీశ్వరులుగా ఎదుగుతారు.
అదృష్టం వీరి వెంటనే ఉంటుందని, చేసే పనిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని కూడా సంఖ్యాశాస్త్రం చెబుతోంది. కుటుంబ సహకారం, సమయానికి వచ్చే అవకాశాలు, సరైన నిర్ణయాలు వీరి సంపద పెరగడానికి ప్రధాన కారణాలుగా మారుతాయి.
ముఖ్యంగా రాబిట్ సంకే ఆరు కలిగిన వాళ్లు నెలలో పుట్టినా 6, 15 లేదా 24 తేదీల్లో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 6గా ఉంటుంది. ఎందుకంటే ఈ తేదీల్లోని అంకెలన్నింటిని కలిపితే చివరికి ఆరే వస్తుంది (6 = 6, 1+5 = 6, 2+4 = 6). సంఖ్యాశాస్త్రంలో రాడిక్స్ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది వ్యక్తి స్వభావం, అదృష్టం, జీవన ప్రయాణాన్ని బలంగా ప్రభావితం చేస్తుందని నమ్మకం.
ఈ తేదీల్లో పుట్టిన వారు సాధారణంగా జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారని న్యూమరాలజీ చెబుతోంది. వీరికి ధనం ఆకర్షితమయ్యే శక్తి ఎక్కువగా ఉంటుంది. కష్టపడితే అవకాశాలు తామే వీరిని వెతుక్కొని వస్తాయని అంటారు. అందుకే వీరి జీవితంలో డబ్బుకు పెద్దగా లోటు రానే రాదు.
