ఏపీ నిరుద్యోగులకు శుభవార్త – డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 99 వేల ఉద్యోగాలకు అవకాశం

ఏపీలో కూటమి ప్రభుత్వం త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించే ప్రక్రియను ప్రారంభించింది

ప్రతి విభాగంలో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం ఉన్న ఖాళీలు, అలాగే అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పూర్తి వివరాలు కూడా ప్రభుత్వానికి చేరుతున్నాయి. భవిష్యత్తులో నియామకాల్లో స్పష్టత రావాలనే ఉద్దేశంతో, పోస్టుల వారీగా అవసరాలు, బడ్జెట్ ఆమోదం, రూల్ పొజిషన్లు వంటి అంశాలపై కూడా సమగ్రంగా విశ్లేషణ జరుగుతోంది.

అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కలిపి సుమారు 30 శాతం వరకు ఖాళీలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఖాళీల్లో భాగంగా కొన్ని కీలక పోస్టులను ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగులతోనే నిర్వహిస్తున్నారు. నేరుగా నియామకాల కోసం (డీఆర్ – Direct Recruitment) వచ్చే ఖాళీలు దాదాపు 99 వేల వరకు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు 24 విభాగాలు తమ ఖాళీల వివరాలను పూర్తిగా నిర్ధారించలేదు. మరో 21 శాఖల్లో ఖాళీల వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ అన్ని శాఖల నుంచి సమాచారం పూర్తిగా వచ్చిన తరువాతే మొత్తం ఖాళీలపై స్పష్టమైన లెక్క తేలనుంది. దాని ఆధారంగానే ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

విభాగాల వారీగా చూస్తే రెవెన్యూ శాఖలో మొత్తం 13 వేల ఖాళీలు ఉన్నట్లు అంచనా. ఇందులో 4,787 పోస్టులను ఇప్పటికే అధికారులు క్లియర్ చేశారు. వీటిలో 2,552 పోస్టులు నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Readmore👇

ఎయిర్‌లైన్స్‌కి ఇంధన ఖర్చు ఎలా పెరుగుతుంది? తెలుసుకోండి

Post a Comment

Previous Post Next Post

Contact Form