కారంగా, కరకరలాడే ముల్లంగి పూరీ – ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాల్సిందే!

అనిపిస్తుంది. కానీ దీని తో చేసే పూరీలు చాలా రుచిగా ఉంటాయి. వేడి వేడి ముల్లంగి పూరీని చట్నీ, పెరుగు లేదా కర్రీతో తింటే చాలు – చలికాలం రోజుల్లో ఆ రుచి మరిచిపోలేరు.ముల్లంగి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, చలికాలంలో ఇమ్యూనిటీని పెంచుతుంది.

కావలసిన పదార్థాలు

ముల్లంగి (తురిమినది) - 1 కప్పు

బియ్యం పిండి - ఒకటిన్నర కప్పులు

జీలకర్ర - 1 టీస్పూన్

కలోంజి (నల్ల జీలకర్ర) - అర టీస్పూన్

పచ్చిమిర్చి - 2

అల్లం తురుము - 1 టీస్పూన్

కొత్తిమీర - కొద్దిగా

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - వేయించడానికి సరిపడా

నీరు - అవసరమైతే కొద్దిగా

తయారీ విధానం

ముందుగా ఒక లోతైన గిన్నెలో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి పొయ్యిపై పెట్టండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత తురిమిన ముల్లంగిని అందులో వేసి గిన్నెకు మూత పెట్టండి. సుమారు 5 నిమిషాల పాటు మధ్య మంటపై ఉడికించండి. ఇలా ఉడికించడం వల్ల ముల్లంగిలో ఉన్న పచ్చి వాసన పోయి, అది మెత్తగా అవుతుంది.

Telegram Join Banner

ఐదు నిమిషాల తర్వాత ఉడికిన ముల్లంగిని నీటిలో నుంచి వడగట్టి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అందులో జీలకర్ర, కలోంజి (నల్ల జీలకర్ర), సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర వేసి బాగా కలపండి. కావాలంటే కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఈ మసాలాలు ముల్లంగితో బాగా కలసి పూరీలకు అద్భుతమైన రుచి, సువాసనను ఇస్తాయి.

ఇప్పుడు మంటను తగ్గించి ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా బియ్యప్పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో వేగంగా కలపాలి. పిండి అంతా కలిసిపోయి ఒక ముద్దలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపి, ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని, కొద్దిగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో మెత్తగా పిసకాలి. అవసరమైతేనే కొద్దిగా నీళ్లు చల్లుకోండి, పిండి గట్టిగా ఉండాలి.ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పూరీల్లా ఒత్తుకోవాలి.

తర్వాత ఒక కడాయిలో సరిపడా నూనె పోసి పొయ్యిపై వేడి చేయండి. నూనె బాగా కాగిన తర్వాత సిద్ధం చేసిన పూరీలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా నూనెలో వేయండి. రెండు వైపులా బంగారు రంగు వచ్చి కరకరలాడే వరకు వేయించండి. ఈ సమయంలో మంటను మధ్యస్థంగా ఉంచితే పూరీలు లోపల వరకు బాగా వేగి రుచిగా వస్తాయి. వేయించిన పూరీలను తీసి టిష్యూ మీద పెట్టి అదనపు నూనె తొలగించండి — అంతే వేడి వేడి, కరకరలాడే ముల్లంగి పూరీలు రెడీ!

ఈ పూరీలను మీకు నచ్చిన టమాటో సాస్, కొత్తిమీర చట్నీ లేదా చల్లటి పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటాయి

Website Popup Message

Post a Comment

Previous Post Next Post

Contact Form