బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే తెలుగులో తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 10వ సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ల్యాండ్‌మార్క్ సీజన్ కావడంతో ఈసారి మరిన్ని కొత్త అంశాలు, ఆసక్తికరమైన టాస్కులు, ఊహించని ట్విస్టులతో షోను మరింత ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది
ఈసారి బిగ్ బాస్ గేమ్ మరింత ఆసక్తికరంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. బిగ్ బాస్ దశావతారం పేరుతో సీజన్ 10ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. దీంతో వీరి మధ్య పోటీ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.దినికి సంబందించి ఆగస్టు 15 నుంచి అగ్నిపరీక్ష కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనే వారిలో కొంతమందికి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించనున్నారు. మరోవైపు వచ్చే నెలలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఈసారి కొంతమంది సెలబ్రెటీలు ఎంపిక చేశారని తెలుస్తుంది. కొంతమంది సెలబ్రెటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, జబర్దస్త్ కమెడియన్ల పేర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, వర్ష, పవిత్ర, వర్షిణి, నందూస్ వరల్డ్ నందు, చంద్రహాస్, జ్యోతి, రాయల్ ఎంసీ రమణ, హీరో అబ్బాస్ వంటి పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి.
కొత్త సీజన్‌లో ఎలాంటి కంటెస్టెంట్లు వస్తారు, ఎలాంటి టాస్కులు ఉంటాయి, ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. సెలబ్రిటీలు, సామాన్యులు కలిసి ఆడే ఈ సీజన్ ఎలా ఉండబోతుందో చూడాలి.
