టాలీవుడ్‌లో రచయితగా కెరీర్‌ను మొదలుపెట్టి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయన సినిమాల్లో మాటలు, కుటుంబ కథలు, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి.ఇప్పుడు అదే విధంగా మరో దర్శకుడి పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ‘సర్’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి.. తాజాగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూర్య, మమిత బైజు, రాధిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విడుదల తర్వాత మంచి స్పందన వస్తోంది
ముఖ్యంగా సినిమాలోని కొన్ని డైలాగులు, కుటుంబానికి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వెంకీ అట్లూరి రాసిన మాటలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలను చూపించిన విధానం త్రివిక్రమ్ సినిమాలను గుర్తు చేస్తోందంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.వెంకీ అట్లూరి కెరీర్‌ను గమనిస్తే ఆయన ప్రయాణంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి, ఆ తర్వాత దర్శకుడిగా మారిన ఆయన.. క్రమంగా తన కథలు, సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
సర్’ సినిమాలో విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలను చూపించిన వెంకీ అట్లూరి.. ‘లక్కీ భాస్కర్’లో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి జీవితాన్ని కథగా తీసుకున్నారు. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో కుటుంబ బంధాలు, అనుబంధాలను కథలో భాగం చేసి మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో చమత్కారమైన మాటలు, కుటుంబ భావోద్వేగాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమాల్లో కూడా సరదా మాటలతో పాటు కుటుంబానికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఇద్దరి శైలిపై సోషల్ మీడియాలో పోలికలు వస్తున్నాయి.
కొత్త కథలను ఎంచుకుంటూ, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలను తనదైన విధంగా తెరపై చూపిస్తు తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
